రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహాన కార్యక్రమం.



రాజానగరం / రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);


రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహాన కార్యక్రమం



ఎన్నికల నియమావళి పై పిపిటి ప్రదర్శన


ప్రచార సమయంలో అనుమతులు తప్పనిసరి


సువిధా యాప్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి


- ఆర్వో చైత్ర వర్షిణి 



ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు-2024 నేపధ్యంలో మార్చి 16 వ తేదీ నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోనికి వచ్చినట్లు 49-రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఏ. చైత్ర వర్షిణి తెలియ చేశారు. 



 శుక్రవారం రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వారి ఆధ్వర్యంలో, రాజకీయ పార్టీ ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం స్ధానిక రాజమండ్రీ ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడమైనది. 



ఈ సందర్బంగా ఆర్వో ఏ. చైత్ర వర్షిణి మాట్లాడుతూ,  ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల ప్రచారం నిమిత్తం తీసుకోవలసిన అనుమతులు, నామినేషన్ కొరకు సమర్పించవలసిన డాక్యుమెంట్లు  విషయంలో ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఎలక్టోరల్ రోల్స్, పోలింగ్ ఏజంట్ల యొక్క విధులు, బాధ్యతలు , పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, బ్యాలెట్ యూనిట్ల వినియోగం పై సమగ్ర సమాచారం అందచేశారు.  అభ్యర్ధులు చేసే ఎన్నికల ఖర్చు వ్యయ విధానములు, అనుబంధ రిజిస్టర్ల నిర్వహణ పై సమగ్ర సమాచారం అందచేశారు. వాటి నిర్వహణా తీరు, ఆడిటింగ్ చేయడం ఏ విధంగా ఉండాలి అను అంశములపై, అవగాహన కల్పించడం జరిగింది. ప్రచారం నిమిత్తం సువిధా యాప్ ద్వారా ఆన్లైన్ లో ధరకాస్తు చేసుకుని, సంభందిత పత్రాలు ఆర్వో కార్యాలయంలో అందచెయ్యలని కోరారు..


ఈ శిక్షణా కార్యక్రమంలో రాజకీయ పార్టీ ప్రతినిధుల యొక్క సందేహాలను నివృత్తి చేయడమైనదని చైత్ర వర్షిణి తెలియ చేశారు.  ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.



సదరు శిక్షణా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., వై. ఎస్. ఆర్. కాంగ్రెస్, తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ప్రతినిధులు హాజరై పై విషయాలపై అవగాహన  పొందుటయే గాక, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. 


ఈ శిక్షణా కార్యక్రమములో  సహాయ రిటర్నింగ్ అధికారి, అబ్దుల్ రహమాన్ మస్తానా , రాజకీయా పార్టీల ప్రతినిధులు బి.జె.పి. - ఎ. శివ నాగరాజు , కాంగ్రెస్ (INC)-  కె. గంగరాజు ,  సి.పి.ఐ. - కె. రాంబాబు ,  సి.పి.ఎం. బి. రాజు లోవ  , వై.యస్.ఆర్.సి.పి. - ఇ.కామేశ్వరరావు, టి.డి.పి. - ఎం. అప్పారావు , జనసేన - వి. రాజు  , సహయ ఎక్స్పెండిచర్ అధికార కె. సుబ్బారావు , సీనియర్ అకౌంటెంట్  భీమేశ్వరరావు, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ సునీత తదితరులు  పాల్గొన్నారు.



Comments