పెదకొండూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జననీరాజనం...

 *పెదకొండూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి  జననీరాజనం...* 


దుగ్గిరాల  (ప్రజా అమరావతి);

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టిన మహిళలు, గ్రామస్తులు.


 దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు , ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. 


ముందుగా శ్రీ కనకపుట్లమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.


 గ్రామంలోని మేరీమాత స్వరూపానికి పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు.


అడుగడుగునా యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని జై జగన్ జోహార్ వైయస్ఆర్ అంటూ నినాదాలు చేశారు.


 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మహిళలకు అభివాదం చేస్తూ సాగిన ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్యలను, పార్లమెంట్ అభ్యర్థిగా కిలారు వెంకట రోశయ్యను అత్యధిక మెజారిటీతో  గెలిపించాలని అభ్యర్థించారు.


 మహిళలు సాదర స్వాగతం పలుకుతూ హారతులు పట్టి జగనన్న తమకు చేసిన మేలును వివరిస్తూ జగనన్నకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


 ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పిటిసి సభ్యులు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, జే సి ఎస్ కన్వీనర్ వై.రవీంద్రబాబు,  జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేశ్వర రజనీకాంత్, ఎంపీటీసీ సభ్యులు కొండూరు సుమన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్మా అర్జున్, శేషయ్య, శ్రీరామ్మూర్తి, కొండూరు సుబ్బారావు,తదితరులు పాల్గొన్నారు.

Comments