సంక్షేమం సుభిక్షం అంటే ఇసుక దోపిడేనా?

 సంక్షేమం సుభిక్షం అంటే ఇసుక దోపిడేనా?


       కొల్లిపర (ప్రజా అమరావతి );                                                                                                                                                                                                           అత్తోట  - కొల్లిపర రోడ్డు పక్కనే వేల టన్నుల అక్రమ ఇసుక నిల్వలు 10నిమిషాల వ్యవథిలో 30 భారీ వాహనాలలో ఇసుకనూ తరలించటంపై     సుభిక్షం సంక్షేమం అంటే ఇసుక దోపిడీనా?  అని TDP MPఅభ్యర్థి Dr.పెమ్మసాని    ప్రభుత్వాన్ని నిలదీశారు.                                                                                                

                                                                                                    తెనాలి ప్రచార కార్యక్రమంలో భాగంగా అత్తోట నుంచి కొల్లిపర వెళ్ళే దారిలో కేవలం 10 నిమిషాల వ్యవధిలో 25-30 భారీ ట్రక్కుల్లో తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాను డా. పెమ్మసాని గుర్తించారు. ఆ ట్రక్కులు ఎక్కడికి వెళ్తున్నాయి అని ప్రశ్నించగా డ్రైవర్లు నోళ్లు మెదపలేకపోయారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పట్ట పగలే అక్రమంగా తరలిస్తున్న ఈ ఇసుక ట్రక్కులకు అనుమతులు ఉన్నాయా? అర్థరాత్రి తవ్వకాలకు పర్మిషన్లు ఎవరూ ఇచ్చారో చూపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ దుర్మార్గపు పాలన ఈ విధంగా ఉందని తరలిస్తున్న ట్రక్కులతో పాటు రోడ్డు పక్కనే నిల్వ ఉంచిన వేల టన్నుల ఇసుక రాశులను పెమ్మసాని చూపిస్తూ ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయించుకోవాలి అని ఆయన ప్రజలకు సూచించారు. 


దీపంఉండగానేఇల్లుచక్కబెట్టుకొంటున్నారు,


 ప్రతీ రోజూ వెయ్యికి పైగా ట్రక్కులతో ఇసుకను తరలిస్తున్నారని  ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా   రాజకీయనాయకులు రెవెన్యూ పోలీసు గనుల శాఖలు దీపం అండగా ఇల్లు చక్కబెట్టకోవాలన్న  ఆతృత కనిపిస్తుందని స్థానికులంటున్నారు.



Comments