ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్..క్యాబినెట్ లో తీర్మాణం.

 *ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్..క్యాబినెట్ లో తీర్మాణం*


హైదరాబాద్ :మార్చి 12 (ప్రజా అమరావతి);

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ల పేర్లను క్యాబినెట్ మరోసారి తీర్మానించింది.


హైకోర్టు ఆదేశాలతో ఈ రెండు పేర్లను రాష్ట్ర ప్రభు త్వం మరోసారి గవ ర్నర్ తమిళసైకి పంపిం చనుంది. కాగా, గవర్నర్ కోటా ఎమ్మె ల్సీల నియామ కాలపై ఇటీవల రాష్ట్ర ప్రభు త్వానికి హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన దాసోజు శ్రవణ్, సత్యనా రాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవ ర్నర్కు లేదని హైకోర్టు పేర్కొంది.


క్యాబినెట్ కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించకూడదని అభిప్రాయపడింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామ కం చేపట్టాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది.


దీంతో మరోసారి ఎమ్మెల్సీల పేర్లను క్యాబినెట్ ప్రతిపా దించిన సర్కార్.. గవర్నర్ కు పంపించ నుంది....

Comments