సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక సందర్భంగా 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజా వ్యవహారాల రంగంలో పద్మవిభూషణ్ ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి.

 


సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక సందర్భంగా 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజా వ్యవహారాల రంగంలో పద్మవిభూషణ్ ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి.


న్యూఢిల్లీ  ఏప్రిల్ 22,(ప్రజా అమరావతి);


భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో ఆంధ్రప్రదేశ్ నుండి పబ్లిక్ అఫైర్స్ రంగంలో భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ ప్రదానం చేశారు.

శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ కింద సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది:

 భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఐదు దశాబ్దాలకు పైగా ప్రముఖ రాజకీయ నాయకుడిగా మనందరికీ బాగా సుపరిచితులే.


ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో 1949, జూలై 1వ తేదీన జన్మించిన శ్రీ నాయుడు విద్యార్థి కార్యకర్తగా ప్రధాన రాజకీయాల్లోకి ప్రవేశించి 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. ఆయన ముప్పై నాలుగు సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా సుదీర్ఘమైన, ప్రముఖ వృత్తిని కలిగి ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుండి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మరియు కర్ణాటక మరియు రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యునిగా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు పని చేశారు. ఆయన 1999లో ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని మంత్రి మండలిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, 2014 మరియు 2017 మధ్య, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిగా మరియు కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగానూ పనిచేశారు. 2017 నుండి 2022 వరకు ఆయన మన భారత ఉపరాష్ట్రపతిగా కూడా విధులు నిర్వర్తించారు.

శ్రీ నాయుడు తన రాజకీయ ప్రయాణంలో రైతులు మరియు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం పాటుపడ్డారు. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ రహదారి కనెక్టివిటీని పెంపొందించడంలో ఆయన పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి. అలాగే స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్, హృదయ్ మరియు అందరికీ ఇళ్లు (పట్టణ) వంటి జాతీయ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పట్టణ జనాభా జీవన నాణ్యతను మెరుగుపరచడంలోనూ ఆయన పాత్ర చాలా కీలకమైంది. రాజ్యసభకు అధ్యక్షత వహిస్తూ, ఆయన అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుసుకున్నారు. అలాగే పార్లమెంటు యొక్క ప్రాముఖ్యత, స్థాయి మరియు ఉత్పాదకతను పెంచడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నించారు. పార్లమెంటరీ కమిటీలు మరియు ఇతర ప్రజాస్వామ్య సంస్థల సమర్థవంతమైన పనితీరు వంటివి ఎంత కీలకమో అందరికీ శ్రీ నాయుడు నొక్కిచెప్పారు. ప్రజల వ్యక్తిగానే కాకుండా;  ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగానూ, ఇంకా అనేక నాయకత్వ పదవులను సైతం చేపట్టారు. అనేక బహిరంగ కార్యక్రమాలలో, ఆయన గొప్ప పౌర యాజమాన్యం మరియు జాతీయ అభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యం కోసం అలాగే విద్య, పాలన మరియు సామాజిక జీవితంలో భారతీయ భాషల మెరుగైన ఉపయోగం కోసం ఎంతో గట్టిగా వివరించేవారు. వాటి ప్రాముఖ్యతను అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని భావించేవారు. శ్రేష్ఠ్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ కల సాకారానికి తోడ్పడాలనే ఆయన నిబద్ధత, మహిళా సాధికారత, యువత నైపుణ్యాభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ 'స్వర్ణ భారత్ ట్రస్ట్'ని స్థాపించేలా చేసింది. తద్వారా గ్రామీణ పేదల ఆరోగ్య సంరక్షణ అవసరాలు మరియు జీవనోపాధి అవకాశాలు కల్పించేలా చేశారు.

శ్రీ నాయుడు తన అనర్గళ ప్రసంగాలు, నిరాయుధీకరణ సరళత మరియు పాలన పట్ల మానవీయ, ఆచరణాత్మక దృక్పథంతో భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నిర్వహించిన వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే విదేశాలలోనూ తన పర్యటనల సమయంలో విస్తారమైన భారతీయ ప్రవాసులను మన దేశానికి మరిన్ని సేవలు చేసేలా వారిని ప్రోత్సహించేవారు.  2017లో నైరోబీలో జరిగిన UN-హాబిటాట్ జనరల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

"భారతదేశంలో చట్ట పాలన, ప్రజాస్వామ్యం మరియు స్థిరమైన అభివృద్ధికి" చేసిన కృషికి ఐక్యరాజ్యసమితి స్థాపించిన శాంతి విశ్వవిద్యాలయం 2019లో శ్రీ నాయుడు గారికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆయనకు అదే ఏడాదిలో 'ది ఆర్డర్ ఆఫ్ ది గ్రీన్ క్రెసెంట్' - ఇది కొమొరోస్ ప్రభుత్వంచే అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. ఆయన చేసిన అత్యుత్తమ ప్రజా సేవ నిమిత్తం అనేక జీవితకాల సాఫల్య పురస్కారాలను కూడా అందుకున్నారు.

Comments