2022-23 ఆల్ ఇండియా కల్పాచార్య అవార్డు అందుకున్న అనకాపల్లి వాసి కొమ్మోజు రమేష్.2022-23 ఆల్ ఇండియా కల్పాచార్య అవార్డు అందుకున్న అనకాపల్లి  వాసి కొమ్మోజు రమేష్అమరావతి (ప్రజా అమరావతి);

 విశ్వ గురువుగా తీర్చిదిద్దామని ఏఐసీటి చీఫ్  కోఆర్డినేటింగ్ అధికారి డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆదివారం బ్రెయినోవిజన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్  ఎక్సలెన్స్ అవార్డులు ప్రధానోత్సవం లో ఆయన పాల్గొన్నారు దేశవ్యాప్తంగా విద్యా పరిశోధన రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి అవార్డులను ప్రధానం చేసి సత్కరించారు. దీనిలో భాగంగా  అనకాపల్లికి చెందిన   కొమ్మోజు రమేష్ కి  2022-23 సంవత్సరానికి గాను ఎడ్యుకేషన్ సెక్టర్లో  తనదైన శైలిలో సేవలందించినందుకు గాను ఆల్ ఇండియా కల్పాచార్య అవార్డు ని  కైవసం  చేసుకున్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ టీవీజీడి ప్రసాద్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్ ఆంధ్ర యూనివర్సిటీ, ప్రత్యేక అతిథిగా భాస్కర్ గంధవాడి,  చేతుల మీదుగా అవార్డుని అందజేశారు.  ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ ఆల్ ఇండియా అవార్డు తనకు రావడం చాలా ఆనందంగా ఉందని దీంతోపాటుగా ఈరోజు విశాఖపట్నం వేదికగా హాజరైన ఆల్ ఇండియా వైడ్  ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో సమాజానికి అనేక  విధాలుగా సేవలు అందిస్తున్న గురువులని  ఈ ప్రదేశంలో కలవడం చాలా ఆనందంగా  ఉందని అన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆల్ ఇండియా లెవెల్ అవార్డ్స్ ఫంక్షన్ కి వివిధ రాష్ట్రాల నుండి అనగా మహారాష్ట్ర, కేరళ కర్ణాటక , తమిళనాడు , పాండిచ్చేరి ,గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్ ,రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు,  తెలంగాణ, ఉత్తరప్రదేశ్   వంటి వివిధ రాష్ట్రాల నుండి  వచ్చిన గురువులను తోటి ఉపాధ్యాయులు కలవడం చాలా ఆనందంగా ఉందని  అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు బీజం వేసి  విజయవంతంగా ముందుకు  నడిపిస్తున్న  బ్రైనోవిజన్ అధినేత గణేష్  నాగ్  కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Comments