భవిష్యత్తు బాగుండాలంటే ఆలోచించి ఓటు వేయాలి.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


 *భవిష్యత్తు బాగుండాలంటే ఆలోచించి ఓటు వేయాలి**తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్*


*మహానాడులో ఓటు ఫర్ నారా లోకేష్,ఓటు ఫర్ పేమ్మసాని చంద్రశేఖర్ ర్యాలీ కార్యక్రమం* 


*నియోజకవర్గ తెలుగు యువత,టి.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ* 


*మణిపాల్ హాస్పిటల్ వద్ద నుండి మహానాడు కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించిన యువత*


ప్రజలు యువత ఆలోచించి ఓటు వేయాలని తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ అన్నారు.ఆదివారం ఉదయం ఎంటిఎంసి పరిధిలోని తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ వద్ద నుండి మహానాడు కరెంట్ ఆఫీస్ వరకు ఓటు ఫర్ నారా లోకేష్,ఓటు ఫర్ పేమ్మసాని చంద్రశేఖర్  ర్యాలీ కార్యక్రమాన్ని నియోజకవర్గ తెలుగు యువతటి.ఎన్.ఎస్.ఎఫ్.ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ సుమారు 2.5 కిలో మీటర్స్ సాగింది.ఈ సందర్భంగా జంగాల వెంకటేష్ మాట్లాడుతూ భవిష్యత్తు బాగుండాలంటే యువత ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలన్నా రావాలన్నా మంగళగిరిలో నారా లోకేష్ కి, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కి 

సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఓటు ఫర్ నారా లోకేష్,ఓటు ఫర్ పేమ్మసాని 

చంద్ర శేఖర్ పై అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే గంజాయిని నిర్మూలించాలంటే మహిళలకు భద్రత కావాలన్నా ఇళ్ల పట్టాలు రావాలన్న మంగళగిరిలో నారా లోకేష్ ని గుంటూరు పార్లమెంటుకి పెమ్మసాని చంద్ర శేఖర్ కి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని 

కోరారు.నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర 

భవిష్యత్తు బాగుడాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆయనతోనే ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయని తెలిపారు. వచ్చేఎన్నికల్లో టీడీపీ,జనసేన,

బిజెపి ఉమ్మడి అభ్యర్థిలకు ఓటు వేసిగెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కేళి వెంకటేశ్వరరావు,మేకా శ్రీధర్ రెడ్డి,దొంతి రెడ్డి మధు,ఆకురాతి నాగేంద్రం,గుద్దంటినాగేశ్వరరావు,

దర్శి హరికృష్ణ,సింగంశెట్టి తేజదర్,బొర్రా అరవింద్,షేక్ ఖాసింబాబు,కొసరాజు శైలజ,కందులు నాగార్జున,కాటా బత్తిని సాగర్,పి, కృష్ణవేణి,అన్నెం కుసుమ,విశాల,లీలాకృష్ణ,పుష్పలత,కాటం అంజిరెడ్డి,అడపా నరేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments