ఎస్.హెచ్.జి.లను ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించ కూడదు.

 *ఎస్.హెచ్.జి.లను ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించ కూడదు*

*•పిఆర్&ఆర్డి, ఎమ్ఏ&యుడి శాఖల అధికారులను కోరిన సిఇఓ మీనా*


అమరావతి, ఏప్రిల్ 16 (ప్రజా అమరావతి):  ఎన్నికల షెడ్యూలు ప్రకటించనప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విదంగా ఎటు వంటి కార్యక్రమాలను నిర్వహించ కూడదంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబందిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.  రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖల ఆద్వర్యంలో పనిచేసే సంబందిత అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎవరకూ కూడా  స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విదంగా ఎటు వంటి కార్యక్రమాలను నిర్వహించ కూడదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకూ  స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగాహన, సర్వే లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆయన తెలిపారు.  ఈ నిబందనల అమలు విషయంలో సెర్ప్ సీఈఓ, మెప్మా (MEPMA) మిషన్ డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ద, చొరవ చూపాలని ఆదేశించారు. Comments