మెడికల్ సీట్లను కూడా అమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్!.



*మెడికల్ సీట్లను కూడా అమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్!*



*1200 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు*


*మరోసారి జగన్ కు ఓటేస్తే రాష్ట్రమంతా అంధకారమే*


*మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్*


మంగళగిరి (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను కూడా వదల్లేదు, కేటగిరిల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసి సీట్లు అమ్ముకున్నారని యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్ షిప్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... జగన్ తీసుకొచ్చిన మెడికల్ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తిపలికి, ప్రతిభకలిగిన పేద విద్యార్థులకు వైద్యవిద్యను అందుబాటులోకి తెస్తాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ కింద రూ.1200 కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడా ఈ పథకం కింద వైద్యం అందించడం లేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తాం.  రాష్ట్రంలో మరోసారి జగన్ కు అధికారమిస్తే అంధకారం రాజ్యమేలుతుంది. ఏడాదికి రెండుమూడు సార్లు విద్యుత్ ఛార్జీలతో బాదేస్తారు. గత అయిదేళ్లలో 9సార్లు ఛార్జీలు పెంచినా ఎడాపెడా కరెంటు కోతలే. నిరంతర విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు సోలార్ పవర్ సంస్థలతో యూనిట్ 2.45 కి ఒప్పందం కుదుర్చుకుంటే వాటిని రద్దుచేసిన జగన్... ఓపెన్ మార్కెట్ లో రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులపై మోయలేని భారం పడుతోంది. గతంలో వందల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వేలల్లో వస్తోంది. పొరుగున ఉన్న హైదరాబాద్, చెన్నయ్, బెంగుళూరు నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఎపిలో జగన్ విధ్వంసక విధానాల కారణంగా రాష్ట్రం 30ఏళ్లు వెనకబడిపోయింది. దేశచరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను జగన్ రద్దుచేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం. పేద విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి గతంలో అమలుచేసిన అంబేద్కర్ విదేశీవిద్యను తిరిగి ప్రారంభిస్తాం.  మంగళగిరి ప్రాంతంలో రోజురోజుకు కుచించుకుపోతున్న చేనేత మగ్గాలను 5వేలకు పెంచి, మళ్లీ గతవైభవం తెస్తాం. జగన్ అస్తవ్యస్త పాలనలో దారితప్పిన రాష్ట్రాన్ని విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు తిరిగి గాడిలో పెడతారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.


Comments