అయోధ్య బాల రాముడికి సూర్యకిరణాల తిలకం.

 *అయోధ్య బాల రాముడికి సూర్యకిరణాల తిలకం* 










ఉత్తరప్రదేశ్ :ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి);

అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అయోధ్య బాల రాముడి నుదుటన సూర్యకి రణాలు ప్రసరించాయి.


ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున రాముడి నుదుటన కిరణాలతో సూర్యతిలకం దిద్దారు. రాముడి నుదుటన మూడున్నర నిమిషాల పాటు సూర్యతిలకం దిద్దారు.


దాదాపు రెండు నిమిషాల పాటు పూర్తిస్థాయి తిలకం గా రాముడు దర్శనమిచ్చా రు. రాముడి నుదుటన 58 మిల్లిమీటర్ల పరిమాణంలో సూర్య కిరణాలు ప్రసరిం చాయి. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు భారీగా తరలివ చ్చారు.


భక్తులు సూర్యతిలకం వీక్షించేందుకు అలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సూర్య కిరణాలు రాముడి నుదిటిపై ప్రసరించేందుకు కటకాలు, అద్దాలు, గేర్‌బా క్సులను ఉపయోగించా మని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.


సూర్య చంద్రరాశుల తిథు లు 19 ఏళ్లకు ఒకసారి కలుస్తాయి కావునా 19 గేర్ బాక్స్‌లను ఉపయోగించిన ట్టు సమాచారం. చాంద్ర మాన తిథికి అనుకూలంగా సూర్య కిరణాలు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున రాముడి నుదుటిపై ఒకే స్థానంలో ప్రసరించేలా చేస్తారు.


సూర్య కిరణాల ప్రసారం కోసం ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్ వాడలేదని సిబిఆర్‌ఐ పేర్కొంది...

Comments