కొల్లాపూర్‌ మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం.

 *కొల్లాపూర్‌ మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం*

నాగర్ కర్నూల్:ఏప్రిల్ 16 (ప్రజా అమరావతి);

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గింది.


ఛైర్‌పర్సన్‌ రఘుప్రోలు విజయలక్ష్మిపై ఈరోజు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగగా.. ఈ తీర్మానానికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో పాటు 15 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు పలికారు.


మరోవైపు బలపరీక్షకు విజయలక్ష్మితో పాటు నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరుకాలేదు. ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి తన హయాంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు.. త్వరలోనే విచారణ చేపడతామని పేర్కొన్నారు.


మంత్రి జూపల్లి సహకా రంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Comments