యువతీయువకులకు ఇంగ్లీష్ బాషా నైపుణ్యాలను అవసరమైన భాషాపరమైన నైపుణ్యాలను అందించే నైపుణ్య శిక్షణ.


అమరావతి (ప్రజా అమరావతి);

*నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ సంస్థ రాష్ట్రములోని ఉత్సాహిక యువతీయువకులకు ఇంగ్లీష్ బాషా నైపుణ్యాలను అవసరమైన భాషాపరమైన నైపుణ్యాలను అందించే నైపుణ్య శిక్షణ


ల గురించి ప్రఖ్యాత UK-ఆధారిత సంస్థలతో చర్చలు*


ఈ  సమావేశంలో, ప్రిన్సిపల్  సెక్రటరీ స్కిల్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్, GoAP, శ్రీ. సురేష్ కుమార్ IAS, MD & CEO - APPSDC శ్రీ రాజ బాబు IASతో పాటు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ Mr. గారెత్ విన్ ఓవెన్‌తో కలిసి  వివిధ రంగాలలో రాణించేందుకుగాను , యువతకు అవసరమైన భాషాపరమైన నైపుణ్యాలను అందించే నైపుణ్య శిక్షణల గురించి  చర్చలు సాగాయి . 


UK ఆధారిత సంస్థల  ప్రతిపాదనలు ప్రకారం ,UK దేశాలలో ఉద్యోగాన్ని కోరుకునే ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఆంగ్ల భాషా శిక్షణ మరియు సర్టిఫికేషన్ ను అందించే  అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను కలిగి ఉన్నాయి. *బ్రిటిష్ కౌన్సిల్, స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ గ్రూప్, పియర్సన్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ మరియు నీత్ పోర్ట్ టాల్బోట్ కాలేజ్ గ్రూప్* సంయుక్తంగా కలిసి  ఇంగ్లీష్ టెస్టింగ్ ప్రత్యామ్నాయాలు, వర్కర్ రైట్స్ ట్రైనింగ్, బ్లెండెడ్ లెర్నింగ్ మోడల్స్ మరియు  ఆన్‌లైన్ కోర్సుల ప్రోగ్రామ్‌లను వివరించాయి. ఈ ప్రయత్నాలు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉపాధి అవకాశాల కోసం ముఖ్యంగా భారతదేశం నుండి ఆరోగ్య సంరక్షణ కార్మికులను మెరుగ్గా సిద్ధం చేయడం మరియు ధృవీకరించడం లక్ష్యం .


ప్రిన్సిపల్ సెక్రటరీ స్కిల్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్, GoAP, శ్రీ. సురేష్ కుమార్ IAS మాట్లాడుతూ,  UK ఆధారిత సంస్థల యొక్క సహకారంతో  ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం కలిగిన మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల వర్క్‌ఫోర్స్‌ను తయారుచేయటమే లక్ష్యం  మేము దీని గురించి సంతోషిస్తున్నాము. ఈ అవకాశాలు మన రాష్ట్ర యువతకు వివిధ రంగాలలో రాణించేందుకు భాష నైపుణ్యాలు పెంపొందించే అభివృద్ధికారకాలు అని తెలియచేస్తూ సంతోషిస్తున్నాను .ఈ ప్రసిద్ధ UK ఆధారిత సంస్థల సహకారంతో ప్రతిపాదించిన భాషానైపుణ్యా కోర్సు లను పైలట్ ప్రాజెక్ట్ గా ముఖ్యంగా హెల్త్‌కేర్ మరియు ఇతర అధిక డిమాండ్ ఉన్న రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ శ్రామిక శక్తి యొక్క ఆంగ్ల భాషా నైపుణ్యం మరియు ఉపాధిని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. 


నైపుణ్యాభివృద్ధి & శిక్షణ  సంస్థ అంతర్జాతీయ భాగస్వాములతో నిమగ్నమవ్వడం ఆంధ్రప్రదేశ్ యువతకు నాణ్యమైన శిక్షణ అవకాశాలను అందించడంలో దాని అంకితభావాన్ని తెలియచేస్తుంది.

Comments