జన సంద్రమైన తెనాలి.

 జన సంద్రమైన తెనాలి





 తెనాలి. (ప్రజా అమరావతి);


తెనాలి రోడ్లన్నీ బుథవారం  జనంతో కిక్కిరిసిపోయాయి.  ప్రథాన పార్టీలైన YCP తరఫున అన్నాబత్తుని శివకుమార్, TDP, జనసేన, BJP కూటమి తరఫున  మనోహర్ లు దాఖలు చేయటానికి బుథవారం మంచి రోజని ఒకేరోజున నిర్ణయించటంతో  ఇరువర్గాలు నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో ఒకవిథంగా వేలాది మందితో  తమ బలప్రదర్శన నిర్వహించాయి, తొలుత YCP అన్నాబత్తుని శివకుమార్ ,MP అభ్యర్థి కిలారి రోశయ్య లు ఎడ్లబండిపై  శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మ ఆలయం నుండి నవయుగ హోటల్  చర్చి రోడ్ లో  నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. వీరి "నడవా" తక్కువ అండటంతో బోస్ రోడ్లో ఇరవైపులా జనంతో నిండారు, రోడ్డంతా వైకిపా రంగుల కాగితం ముక్కలు పవర్ స్ప్రేయరుతో స్ప్రే చేయటంతో రోడ్డంతా పరచారు.


అనంతరం కూటమి అభ్యర్థి మనోహర్ ఆలపాటి రాజా పాటిపండ్ల రామకృష్ఞ లతో కలసి ఐతానగర్ నుండి గాంథిచౌక్ శివాజీచౌక్  మీదుగా  రాజా అండటంతో నియోజకవర్గంలో ని TDP కార్యకర్తలు  జిల్లాలోని జన జనసైనికులు తెనాలిసీటు జనసేనకు  ఒకటే కావటంతో జిల్లాతో పాటు పొరుగు జిల్లాలనుండి జన సైనికులు  వీరనారీమణులు BJP కార్యకర్తలు MRPS నాయకుల కార్యకర్తలు పెద్దసంఖ్యలో ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నామపత్రాలను సమర్పించారు. 4గం॥పాటు సాగిన ర్యాలీలో పాల్గొన్నవారికీ దాహార్తిని మజ్జిగ తో తీర్చారు.


ఇరవర్గాలు" థూం థాం"  తీన్మార్  DJలతో టపాకాయలు పేలుస్తూ విచిత్ర వేషథారణలతో పోలీసులు కేటాయించిన రూట్లలో తమ బలాలను బలగాలను ప్రదర్శించారు. పోలీసులైతే ఎదురెదురుగా  ఇరువర్గాలు ఎక్కడ మోహరిస్తాయో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కల్గుతందో అని  అనుకొని  భయపడుతుంటే  ఓ వైకాపా ప్రముఖ నాయకుడు అత్యుత్సాహంతో తమ పోలీసునే  ప్రక్కన DSPఉన్నాకూడా  లెక్కచేయకుండా పోలీసునే  గదమాయించటం పోలీసు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది,



Comments