బాలల న్యాయ చట్టం పరిధిలో బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుంది.

 బాలల న్యాయ చట్టం పరిధిలో బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుంది.


  అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో బాలల న్యాయ చట్టం పరిధిలో మాత్రమే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుంది అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్,గోండు సీతారాం,బత్తుల పద్మావతి,త్రివర్ణ ఆదిలక్ష్మి తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద బహిరంగ సభ లో కొంత మంది దుండగులు రాళ్ళు తో దాడిచేసి గాయపర్చిన సంఘటన నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు బాలల హక్కుల కమిషన్ మీద అవగాహన లేకుండా అపనిందలు వేస్తున్నారని తెలిపారు.

భారత రాజ్యాంగం ప్రకారం రూపొందించిన చట్టాలు ప్రకారం వ్యవస్థ తమ పని తాము చేసుకు పోతారని, ఎవరూ కూడా అతీతులు కారని తెలిపారు.

ఎక్కడ కూడా పోలీసు మరియు ఇతర అధికారులు బాలల హక్కులు ఉల్లంఘన చేసినట్టు కమిషన్ కు ఫిర్యాదులు రాలేదని తెలిపారు.

కమిషన్ కు వచ్చిన సమస్యలను, ఫిర్యాదులపై విచారణ  చేపట్టి వాటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కు  సిఫార్సు లు  చేస్తుందని తెలిపారు

నిందితులు ఇద్దరు కూడా మెజర్లు అని తెలిపారు. ఎక్కడైనా ఎప్పుడైనా బాలల హక్కుల కు ఉల్లంఘన జరిగినట్లు భావిస్తే తమకు పూర్తి స్థాయిలో అధారాలుతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా కమిషన్ స్పందించి విచారణ చేపడుతుందని తెలిపారు.

అంతేకాని ప్రసార మాధ్యమాల్లో బాలల హక్కుల గురుంచి నిరాదరణ ఆరోపణలు చేయడం తగదని సూచించారు.


రాష్ట్ర వ్యాప్తంగా  బాలలకు  రక్షణ  సంరక్షణ చర్యలు కమిషన్ తీసుకుంటున్నామని, అన్నీ  విధాలుగా వారి హక్కులుకు భంగం కలగకుండా  సేవలు  అందిస్తున్నామని తెలిపారు


ఎక్కడైనా ఎవ్వరైనా బాలల హక్కులు కు భంగం కలిగించే విధంగా  ప్రవర్తిస్తే  వాటిని సుమోటోగా తీసుకొని బాలల హక్కుల కమిషన్ ద్వారా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments