టిడిపిలో చేరిన జగన్ సన్నిహితుడు!



*టిడిపిలో చేరిన జగన్ సన్నిహితుడు!*



*నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిక*


ఉండవల్లి (ప్రజా అమరావతి): మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. లోకేష్ నినాదానికి ఆకర్షితులైన వివిధ పార్టీల నేతలు యువనేత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.  తాజాగా ముఖ్యమంత్రి  జగన్ సన్నిహితుడు, మంగళగిరి రూరల్ మండలం కురగల్లు గ్రామానికి చెందిన ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్టెపోగు బసవరావు ఆధ్వర్యంలో 10మంది టిడిపిలో చేరారు. జగన్ కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖపట్నం వరకు  బసవరావు 2వేల కి.మీ.లు పాదయాత్ర చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక జగన్ విధానాలతో విభేధించి ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాము టిడిపిలో చేరుతున్నట్లు చెప్పారు.  వీరితో పాటు తాడేపల్లి రూరల్ ఉండవల్లి గ్రామానికి చెందిన లంకా భువన శేషగిరి చరణ్, కే.ఫణిశర్మ ఆధ్వర్యంలో 20 మంది పార్టీలో చేరారు. వీరందరికీ లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… ఎస్సీల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేసిన దళిత ద్రోహి జగన్ అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో 188 దళితులను ఊచకోత కోశారు. దళితులను చంపిన డోర్ డెలివరీ చేసిన అనంతబాబు లాంటి వారిని పక్కనబెట్టుకున్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో మూల దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక దళితులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, దళితులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో దళితులకు అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం స్వయం ఉపాధి రుణాలు అందజేస్తామని లోకేష్ పేర్కొన్నారు.


Comments