విజయవంతంగా టోఫెల్ పరీక్ష.
విజయవాడ (ప్రజా అమరావతి);

 

*విజయవంతంగా టోఫెల్ పరీక్ష**టోఫెల్ పరీక్షకు హాజరైన 4,53,265 మంది 3 - 5వ తరగతి విద్యార్థులు*


*ఏప్రిల్ 12న 6-9 తరగతుల విద్యార్థులకు టోఫెల్ జూనియర్ పరీక్ష*


*హాజరుకానున్న 16,52,142 మంది విద్యార్థులు*


*పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రిన్స్ టన్ లోని ఈటీఎస్ నుండి టోఫెల్ సర్టిఫికేట్ అందజేత* 


: - *పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్*


3 - 5వ తరగతి విద్యార్థులకు నేడు టోఫెల్ పరీక్ష విజయవంతంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 13,104 పాఠశాలల్లో 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారని స్పష్టం చేశారు. ప్రధానంగా గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరవడం ఆశ్చర్యమేసిందన్నారు. 


  అదే విధంగా 5,907 పాఠశాలల్లో 6-9 తరగతులు చదువుతున్న 16,52,142 మంది విద్యార్థులకు ఏప్రిల్ 12 (శుక్రవారం)వ తేదీన టోఫెల్ జూనియర్ పరీక్షలు  సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టోఫెల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రిన్స్ టన్ లోని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్(ఈటీఎస్) నుండి టోఫెల్ సర్టిఫికేట్ అందిస్తామని పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా టోఫెల్ పరీక్షకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ  ప్రాథమిక స్థాయి నుండే స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టోఫెల్ పరీక్షలు రాయడం గొప్ప అనుభూతిని కలగజేసిందన్నారు. టోఫెల్ సర్టిఫికేట్ అందుకునేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామన్నారు.     Comments