ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవ యాప్ పనిచేయడం లేదని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం:- ఐ‌జి సాంకేతిక విభాగం.ఐ‌జి. కార్యాలయం,

సాంకేతిక విభాగం,

మంగళగిరి. (ప్రజా అమరావతి);


*ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవ యాప్ పనిచేయడం లేదని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం:- ఐ‌జి సాంకేతిక విభాగం*


గత కొన్ని రోజులుగా వివిధ దిన పత్రికలలో ఏ.పి పోలీస్ సేవా యాప్ మీద వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం, సత్య దూరం. పోలీస్ శాఖ సాంకేతిక విభాగం  ప్రజల సౌలభ్యం కోసం కొన్ని సేవలను/సదుపాయాలను పోలీస్ వెబ్‌సైట్  మరియు ఏపి పోలీస్ సేవా ఆప్ ల ద్వారా అందిస్తోంది.  


ఎలక్షన్ కోడ్ అమలు లో భాగంగా ఏ పి పోలీస్ సేవా ఆప్ ప్రస్తుతం మార్పులు,చేర్పుల నిర్వహణలో ఉన్నందున పోలీస్ సేవా ఆప్ లోని సేవలను  ప్రజలకు పోలీస్ వెబ్‌సైట్  ద్వారా అందించడం జరుగుతుంది.  ఇందులో ఎటువంటి ఇతరత్రా అనుమానాలకు ఆస్కారం లేదు.  


ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చెయ్యడం, కేసు వివరాలను తెలుసుకోవడం వంటి సదుపాయాలు, ఎఫ్ఐఆర్ లకు సంభందించిన సేవలను పోలీస్ వెబ్‌సైట్ ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు అందుబాటులొ ఉన్నాయి. కావున ప్రజలు వాటిని పోలీస్ వెబ్‌సైట్  (citizen.appolice.gov.in) ద్వారా పొందగలరు.

Comments