జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు.

 

*జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు


*


*అన్నమయ్య ప్రాజెక్టును ముంచిన వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి*


*డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం.*


*వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి మీరే చికిత్స చేయాలి*


*ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుమార్తెను చదివించి, ఉద్యోగం ఇస్తాం*


*రాజంపేటలో మెడికల్ కాలేజీ కట్టిస్తాం*


*గాలేరు-నగరి పూర్తి చేసి రాజంపేటకు కృష్టా జలాలు తెస్తాం*


*కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించి బాధితులను ఆదుకుంటాం*


*బీజేపీతో పొత్తుపై వైకాపా తప్పుడు ప్రచారం-ముస్లింలకు న్యాయం చేసింది... చేసేది మేమే*


*రాజంపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు*


రాజంపేట (ప్రజా అమరావతి):- రాజంపేట ప్రజల ఉత్సాహం చూస్తుంటే పోలీంగ్ స్టేషన్లు దద్దరిల్లిపోయేలా ఉన్నాయి. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటులో జగన్ రెడ్డి కొట్టకుపోతాడు. మీ ఉత్సాహం చూస్తుంటే జగన్ రెడ్డిని ఇంటికి పంపడం ఖాయం. రాజకీయాల్లో నేను కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా కాలం నుంచి ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి చాలా అనుభవజ్ఞుడు. బాలసుబ్రమణ్యం మీ అభిమాన నాయకుడు పాలకొండ రాయుడి కుమారుడు...ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించాలి. పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు. పవన కళ్యాణ్ గుండెల్లోంచి మాట్లాడాడు. ఈ అరాచక శక్తులను అధికార పీఠం నుంచి దించడానికి మీరందరూ సిద్దంగా ఉండాలి. 


*జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు*

లక్ష్మీ ప్రసన్న అనే ఈ అమ్మాయి... ఒంటిమిట్టకు చెందిన చేనేత కార్మికుడు పాల సుబ్బారావు కుమార్తె. ఆయనకున్న పొలం అమ్మి అప్పులు కట్టి పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు. వైకాపా నాయకులు సుబ్బారావు పొలాన్ని ఆక్రమించుకుని కబ్జా చేశారు. ఆన్ లైన్ లో సుబ్బారావు పేరు తొలగించి వారి పేర్లు ఎక్కించుకున్నారు. ఎమ్మార్వో దగ్గరి వెళ్లినా న్యాయం జరగలేదు. అందుకే ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమార్తె ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ లో ఉండటంతో ఆమె బ్రతికిపోయింది. జగన్ రెడ్డి దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది.


సుబ్బారావు కటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న వెంటనే తెలుగుదేశం పార్టీ రూ.5 లక్షలు ఆర్ధిక సహాయం చేశాం. కుటుంబాన్ని ఓదార్చాం. లక్ష్మీ ప్రసన్నను ఆదుకుంటాం. ఆమెను చదివించి జీవితంలో స్థిరపడేలా తోడ్పాటు అందిస్తాం. పెద్దరెడ్డి పాపాలు సమాజాన్ని సర్వనాశం చేసే స్థాయికి చేరాయి. వైకాపాకు ఓటేస్తే...విధ్వంసమే. వైకాపా భూదందాలతో అన్యాయానికి గురైన కోవూరి లక్ష్మీ ఢిల్లీకి వెళ్లి ఇండియా గేటు వద్ద తన బొటన వ్రేలు కోసుకుంది. మీ జీవితాలు బాగుపడాలంటే మిధున్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి.


*అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేసి రైతులను ఆదుకుంటాం:*


అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే జగన్ రెడ్డి న్యాయం చేశాడా? 40 మంది చనిపోయాయా లేదా? జగన్ రెడ్డి న్యాయం చేయకపోతే.. 40 మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఒక్కొక్కరికి లక్ష ఆర్ధిక సహాయం చేశాం. జగన్ రెడ్డి కనీసం ఇల్లు కట్టించలేదు. అన్నమయ్య ప్రాజెక్టుకు దిక్కులేదు కానీ.. జగన్ రెడ్డి మూడు రాజధానులు కడుతానంటున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. కానీ, మేం ఎన్నడూ జగన్ లాంటి దుర్మార్గమైన సి.ఎం ను చూడలేదు.


అన్నమయ్య డ్యాం కోట్టుకుపోవడానికి కారకులైన అమర్నాధ్ రెడ్డి. పెద్దిరెడ్డిలను ఓడించాలి. ప్రత్యర్ధులకు డిపాజిట్లు కూడా రాకూడదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడే విజయోత్సవ సభ పెడుతాం. పనవ్కళ్యాణ్ ను ఓడిస్తామని చెబుతున్నారు. మీ పౌరుషం లేదా. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తామని కుట్రలు చేస్తున్న వారికి మీ సత్తా చూపించాలి. రైతుల కోసం అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తాం. బాధితులకు నష్టపరిహారం ఇస్తాం. పునరావాసం కల్పించి వారిని ఆదుకుంటాం. రైతును రాజును చేస్తాం. ప్రతీ రైతుకు అన్నదాత కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.


*పాపాల పెద్దిరెడ్డి ద్వారా మద్యం డబ్బులు తాడేపల్లి ఫ్యాలెస్ చేరాయి*


తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ రూ.60 రూపాయలు. నేడు అది కాస్తా రూ.200 అయ్యింది. పెరిగిన డబ్బులు ఎవరి జోబుల్లోకి వెళ్లాయి. పాపాల పెద్దిరెడ్డి ద్వారా ఆ డబ్బులు జగన్ రెడ్డి ప్యాలెస్ కు చేరాయి. రాష్ట్రంలో ధరలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. మా వద్ద అనుభవం ఉంది. చేయాలనే పట్టుదల ఉంది. రాష్ట్రం బాగుపడాలి. అందుకే అందరూ కలిశాం. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర బాగు కోసం ఆలోచించే వ్యక్తి. 2014 లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయేకు సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా వచ్చి ఒక మాట చెప్పారు. పొత్తులు వల్ల లాభాలు,నష్టాలు భేరీజు వేసుకోకుండా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలని చెప్పాడు. కూటమి పొత్తుకు అదే నాంది. బీజేపి, టిడిపి, జనసేనలు కలిసింది మా కోసం కాదు. రాష్ట్రం కోసం. కిరణ్ కుమార్ రెడ్డి సి.ఎంగా ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా? టిడిపి హయాంలో మైనారిటీలకు అన్యాయం జరిగిందా? ముస్లింలలో అపోహలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్న పార్టీ వైసీపీ.


*డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం.*

 

జగన్ రెడ్డి హడావిడి జిల్లాల పునర్వభజనతో మీకు అన్యాయం జరిగిందా.. లేదా? జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం కాదా? మీకు న్యాయం కావాలా లేదా? ఈ జిల్లావాసులు కిరణ్ కుమార్ రెడ్డి, బాలసుబ్రమణ్యం లను గెలిపించండి. మీకు నాయ్యం చేసే బాధ్యత మాది. ప్రజాభిప్రాయం ప్రకారం పాలన చేయాలి. అధికారం ఉంది కదాని ఇష్టానుసారం చేస్తే ఇలానే సమస్యలు వస్తాయి. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. జగన్ రెడ్డిపై తిరుగుబాటు రాజంపేటలో చూస్తున్నా. రాయలసీమలో తిరుగుబాటు మొదలైంది. అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం. డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. 


*వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి మీరే చికిత్స చేయాలి*


2019 లో బాబాయిని గొడ్డలితో చంపి రాజకీయం చేశాడు జగన్ రెడ్డి. హు కిల్డ్ బాబాయి? బాబాయిని ఎవరు చంపారో మీకు తెలిస్తే చేతులెత్తండి. బాబాయిని ఎవరు చంపారో మీకు తెలుసు..కానీ, జగన్ రడ్డికి తెలియదంట. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా వేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా వేస్తున్నాడు. గులకరాయి గాయం రోజురోజుకు పెద్దదవుతోంది. రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి ఆ గాయానికి చికిత్స మీరు చేయాలి.

 

*రాజంపేటలో మెడికల్ కాలేజీ కట్టిస్తాం*

రాజంపేట జిల్లా కేంద్రం అయితే మెడికల్ కాలేజీ వస్తుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. రాజంపేటను ఒక మంచి నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. మాచుపల్లి బ్రిడ్జి పూర్తిచేస్తాం, ఓబిలి-టంగుటూరు హైలెవల్ బ్రిడ్చి ఏర్పాటు చేస్తాం.  జర్రికోన ప్రాజెక్టు పూర్తి చేసి సుండుపల్లి మండలానికి త్రాగునీరు, సాగునీరు ఇస్తాం, గాలేరు-నగరి కాలువలు పూర్తిచేసి కృష్ణా జలాలను తీసుకొస్తాం. విభజన తర్వాత ఒంటిమిట్టను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. బ్రహ్మాండమైన రామాలయాన్ని కట్టాం.


*మహాశక్తితో మహిళలను ఆదుకుంటాం*

మేం సూపర్ సిక్స్ తో ముందుకొస్తున్నాం. ఆడబిడ్డలకు మహాశక్తితో ఆడబిడ్డ నిధి కింది నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ప్రతీ బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. ధరలు పెరిగిపోయాయి. ప్రతీ ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఆదుకుంటాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. 


*యువగళంతో యువతకు న్యాయం చేస్తాం.*


యువతకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని నమ్మకం ఉందా? మేం వస్తానే మెగా డీఎస్సీ పైనే మొదటి సంతకం పెడుతాం. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం.


*జగన్ కట్టింది ఊళ్లు కాదు..గూళ్లు.*

జగన్ కట్టింది ఊళ్లు కాదు..గూళ్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. నెలకు రూ.4 వేల ఫింఛన్ ఇస్తాం. జూలై నుంచే అమలు చేసి 4 నెలలు బకాయిలు ఇస్తాం. మొదటి తారీఖునే ఇంటివద్దకే తెచ్చిస్తాం. తెలుగుదేశం పై నిందలు వేయడానికి వృద్దులను ఇబ్బందులకుగురిచేస్తున్నారు. ప్రజలకు మేలు జరిగేలా కూటమి సభ్యులు చర్చించుకుని మేం చేయగలిగిందంతా చేస్తాం. హలో ఏపీ...బాయ్ బాయ్ జగన్.


Comments