నేటి నుంచి (మే 17) డి సెట్ - 2024 హాల్ టికెట్ల విడుదల.

విజయవాడ (ప్రజా అమరావతి);


*నేటి నుంచి (మే 17) డి సెట్ -  2024 హాల్ టికెట్ల  విడుదల*

మే 24న ప్రవేశ పరీక్ష

పాఠశాల విద్యాశాఖ కమిషనర్  ఎస్.సురేష్ కుమార్ 


రాష్ట్రంలోని ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం  కోసం నిర్వహించే డిసెట్ (DEECET-2024) ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు  పాఠశాల విద్యాశాఖ కమిషనర్  ఎస్.సురేష్ కుమార్  ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 22న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తమ హాల్ టికెట్లు నేటి నుంచి (17.5.24) https://cse.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే  వివరాలను సరి చూసుకోవాలని తెలిపారు. అభ్యర్థి పేరు,  తండ్రి పేరు,  ఆధార్ నంబరు,  మీడియం   మొదలైన అంశాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే కింద తెలిపిన హెల్ప్ లైన్ నెంబర్ లకు (8125046997  మరియు  8121947387) ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

అధికారులు తప్పులను సవరించి హాల్ టికెట్లను తిరిగి  వెబ్సైట్లో  ఉంచుతారు. వాటిని  అభ్యర్థులు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని  ఈ నెల 24న జరిగే పరీక్షకు హాజరవ్వాలని  , పాఠశాల విద్యాశాఖ కమిషనర్  ఎస్.సురేష్ కుమార్  తెలిపారు. 


Comments