ప్రజాస్వామ్యానికి ఓటు అనేది పునాదిలాంటిది...

 


 *ప్రజాస్వామ్యానికి ఓటు అనేది పునాదిలాంటిది...* 



 *ప్రజాస్వామ్యంలో ఓటు అనేది హక్కుమాత్రమే కాదు బాధ్యత కూడా...* 


 *ముగ్గుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేత...* 


ఏలూరు,మే,11(ప్రజా అమరావతి):ప్రజాస్వామ్యానికి ఓటు అనేది పునాదిలాంటిదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు.  


శనివారం స్ధానిక సెయింట్ థెరిస్సా మహిళా డిగ్రీ కళాశాలలో స్వీప్ కార్యక్రమంలో బాగంగా ఓటు ప్రాముఖ్యతపై ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్, ఎస్.ఎ. రామన్, పోలీస్ పరిశీలకులు టి. శ్రీధర్, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. 


ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ 18 కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివశించే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరులందరికి భారత రాజ్యాంగం ఓటుహక్కు కల్పించిందని కనుక అర్హులందరూ ఓటుహక్కును ఉపయోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.  ప్రజాస్వామ్యంలో ఓటు అనేది హక్కుమాత్రమే కాదని బాధ్యత కూడా అని ఆయన స్పష్టం చేశారు.  ప్రతిఒక్కరూ త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కావాలని ప్రశ్నించే హక్కును వినియోగించుకుంటామని అదే సమయంలో సరైన ప్రభుత్వాన్ని ఓటు ద్వారా ఎన్నుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.  జిల్లాలో గత ఎన్నికల్లో సగటు 83 నుంచి 84 శాతం పోలింగ్ నమోదు కాగా 2024 ఎన్నికల్లో కనీసం 90 శాతం ఓటు నమోదు జరగాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను చేపట్టామన్నారు.  దీనిలో బాగంగా 2 వేల కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఇందులో స్వీప్ నోడల్ అధికారి విశ్వనాథ్ శ్రీనివాస్ ను అభినందించారు.అందరూ ఓటుహక్కును వినియోగించకునేందుకు భధ్రత, రక్షణ చర్యలు కల్పిస్తున్నామని కనుక ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును ఉపయోగించుకోవాలన్నారు.  మీఓటు మీ భవిష్యత్ అన్న విషయాన్ని మరువద్దన్నారు.  



పోలీస్ అబ్జర్వర్ టి. శ్రీధర్  మాట్లాడుతూ ఓటుహక్కు వినియోగించుకోకపోవడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాధమని పేర్కొన్నారు.  కనుక ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరూ దానిని వినియోగించుకుని తమ అస్ధిత్వాన్ని నిలుపుకోవాలన్నారు.  ఎటువంటి ప్రలోభాలకు, వత్తిడులకు ప్రభావం కాకుండా నిర్బయంగా ఓటుహక్కు ఉపయోగించుకోవాలన్నారు.  ఓటు ప్రాముఖ్యతపై నిర్వహించిన రంగవల్లుల అందమైన కార్యక్రమం ఏర్పాటు ఆనందదాయకమన్నారు.  



ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్ మాట్లాడుతూ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటువేయడం మన హక్కుఅని పేర్కొన్నారు.  ఈనెల 13వ తేదీన జరిగే ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  ఓటు ప్రాముఖ్యతను విశదీకరించేందుకు నిర్వహించిన ముగ్గుల పోటీ ఉత్సవరూపానిచ్చిందన్నారు. మహిళలు సుందరవంతంగా నిర్వహించిన దీపాలంకరణ, ముగ్గుల పోటీ, ఎంతో ఆకట్టుకొనే రీతిలో ఉన్నాయన్నారు.  



అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు.  వీరిలో వై.వి. సత్యవతి రూ. 20 వేలు, పద్మావతి రూ. 15 వేలు, నాగేశ్వరమ్మ రూ. 10 వేలు నగదు బహుమతులను పొందారు.  ఈ సందర్బంగా పోటీల్లో పాల్గొన్న వారందరికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు.  


కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.ఎ. రామన్, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు,  స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్, కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, బి.సి. సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి,  ఉద్యానశాఖ డిడి రామ్మోహన్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎన్ఎస్ కృపావరం, మెప్మా పిడి ఇమ్మానియేల్, ఆర్ అండ్ బి ఎస్ఇ జాన్ మోషే,  డిసిపివో సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు. 


Comments