మంగళగిరిలో ఏ పద్మశాలీ కుటుంబాన్ని వైసీపీ ఆదుకోలేదు.

 *మంగళగిరిని సొంతం కుటుంబంలా చూసుకున్న వ్యక్తి నారా లోకేష్*


*లోకేష్ 80వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారు*


*మంగళగిరిలో ఏ పద్మశాలీ కుటుంబాన్ని వైసీపీ ఆదుకోలేదు**చేనేతలకు ఆ రెండు కుటుంబాలు చేసిన అరాచకాలను మంగళగిరి ప్రజలు మర్చిపోలేరు*


*ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్*


---ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ 


మంగళగిరి టౌన్, మే 11 (ప్రజా అమరావతి):   మంగళగిరిని సొంతం కుటుంబంలా చూసుకున్న వ్యక్తి నారా లోకేష్ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మేం ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు లోకేష్‌కు ఓటేస్తేనే న్యాయం జరుగుతుందని ఇక్కడి ప్రజలు ఘంటాపథంగా చెబుతున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నారా లోకేష్ 80వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారు. వైసీపీ ప్రచారంలో జనం లేకపోయినా గ్రాఫిక్స్ తో వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియా మాయ చేశారు. వీఎఫ్ ఎక్స్ లతో పబ్బం గడుపుకుంటున్నారు. పాతబస్టాండ్ సెంటర్ లో జగన్ సభ పెట్టినా ప్రజల నుంచి స్పందన లేదు. జగన్ రెడ్డికి సిగ్గూ, ఎగ్గూ లేదు. 


*పార్టీలకు అతీతంగా లోకేష్ సాయం*


నాలుగున్నరేళ్లుగా మంగళగిరిలో లోకేష్ గారు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నూతన వధూవరులకు పెళ్లికానుక, అన్నా క్యాంటీన్, తోపుడు బండ్లు, కుట్టుమిషన్ లు, రాట్నాలు అందించారు. సంజీవని ద్వారా ఉచిత వైద్యసేవలు, యువకులకు ఉచిత సాంకేతిక శిక్షణ, క్రీడా ప్రాంగణాలతో యువతకు ప్రోత్సాహం, వికలాంగులకు ట్రై సైకిళ్లు, ఇస్ట్రీ పెట్టెలు, పండుగ కానుకలు, సెలూన్ లలో కుర్చీలు, కోవిడ్ వైద్య సాయం, ఎవరైనా చనిపోతే మట్టిఖర్చులకు సాయం వంటి అనేక విధాలుగా అండగా నిలిచారు. పార్టీలకతీతంగా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేశారు. 


*ఏ పద్మశాలీ కుటుంబాన్ని వైసీపీ ఆదుకోలేదు*


ధర్మవరంలో చేనేత వస్త్రవ్యాపారులను నగ్నంగా కూర్చోబెట్టారు. ధర్మవరంలో వైసీపీ నాయకుడికి సరుకు ఇచ్చి రెండేళ్లు అయినా నగదు ఇవ్వకపోవడంతో డబ్బు అడిగినందుకు వ్యాపారులను నగ్నంగా కూర్చోబెట్టి వారి వద్ద బంగారు ఆభరణాలు గుంజుకుని వేధించారు. ఆ రోజు లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని ధర్మవరం పంపి.. వ్యాపారులకు అండగా నిలవాలని సూచించారు. వారికి అన్ని విధాల భరోసా ఇవ్వడంతో పాటు.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలపై కేసు నమోదు చేయించారు. ఈ రోజు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి బాధిత కుటుంబం గురించి కనీసం పట్టించుకోలేదు. వారి గురించి మాట్లాడలేదు. మంగళగిరిలో ఏ పద్మశాలీ కుటుంబాన్ని వైసీపీ ఆదుకోలేదు. ఆ రెండు కుటుంబాల అరాచకాలను మంగళగిరి ప్రజలు మార్చిపోలేరని అన్నారు.


*చేనేత కుటుంబానికి అండగా నిలిచింది టీడీపీ*


ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల కడప జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. జగన్ రెడ్డి సొంత జిల్లా కడప ఒంటిమిట్ట మాధవరం మండలంలో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పు తీర్చేందుకు వారికున్న నాలుగు ఎకరాల భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా.. వైసీపీ నేత ఆక్రమించుకున్నారు. దీంతో మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని తట్టుకోలేక కుటుంబ సభ్యులు ముగ్గురు విషం తాగి చనిపోయారు. బాధిత కుటుంబానికి చెందిన యువతికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల భరోసాగా నిలిచింది. బాధిత చేనేత కుటుంబాల గురించి వైసీపీ నేతలు ఏనాడూ మాట్లాడలేదు. కులం పేరు తీసుకువచ్చి మంగళగిరిలో ట్రోల్స్ చేస్తున్నారు. అంతకుముందు ఇదే కులానికి చెందిన వ్యక్తికి సీటిస్తే.. ఆ రెండు కుటుంబాలు దగ్గరుండి ఓడించిన మాట వాస్తవం కాదా? పద్మశాలీ కల్యాణ మండపాల్లో ఈ రెండు కుటుంబాలు పెత్తనం చేస్తున్నారు. డోనర్స్ పేర్లు కూడా లేకుండా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా? మంగళగిరిలో మీ ఇంటి ఎదురు ఉన్న రోడ్డు తప్ప ఒక్క రోడ్డు అయినా వేశారా? సర్వశిక్ష అభయాన్ కింద ఎన్నో అరాచకాలు చేశారు. 


*అమరావతి మహిళలపై దమనకాండ*


అమరావతిలో మహిళలపై దమనకాండకు పాల్పడిన ఘటనలు మనం అనేకం చూశాం. ఉద్యమంలో పాల్గొన్న మహిళలను జైళ్లకు పంపారు. రాత్రిపూట పోలీస్ స్టేషన్లలో మహిళలను నిర్బంధించారు. ఆడవాళ్ల పట్ల హింసకు పాల్పడిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓటు రూపంలో బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. లోకేష్ గారిని 80వేల అఖండ మెజార్టీతో మహిళలను గెలిపించనున్నారు. 


*ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై గళం విప్పింది చంద్రబాబు, లోకేష్*


కరకట్ట రోడ్డు ఈ రోజుకూ ఎందుకు వేయలేదు? కమీషన్ల కోసం బెదిరించడంతో కాంట్రాక్టర్లు పారిపోయారు. టీటీడీ లెటర్లు కూడా అమ్ముకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ప్రజల భూములు కబ్జా చేయాలని చూస్తున్నారు. దీనిపై మొదత గొంతు విప్పింది చంద్రబాబునాయుడు, లోకేష్ గారు. మన  తరతరాలుగా సంపాదించిన ఆస్తులు జగన్ రెడ్డి ధారాదత్తం చేయాలని హుకూం జారీచేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు ఏనాడూ ఒక్కమాట కూడా మాట్లాడలేదు.


*రెండున్నర లక్షల కోట్లతో చంద్రబాబు సంక్షేమం*


చంద్రబాబునాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత లోటు బడ్జెట్ లో కూడా రెండున్నర లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమం అందించిన విషయం మీకు తెలియదా? జనవరిలో జగన్ రెడ్డి బటన్ నొక్కినా ఇప్పటివరకు లబ్ధిదారులకు  నిధులు జమకాలేదు. ప్రజల్లో సంక్షేమం పేరుతో సంక్షోభవం సృష్టించారు. పాస్ బుక్ ల్లో జగన్ రెడ్డి ఫోటో ఎందుకు ముద్రిస్తున్నారు? మద్యం తాగే వారిని తాకట్టుపెట్టారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములు దోచుకుంటున్నారు. అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. గంజాయితో యువత భవిష్యత్ ను నిర్వీర్యం చేస్తున్నారు. 


*మహిళల కోసమే సూపర్ సిక్స్*


చంద్రబాబునాయుడు మహిళల కోసమే సూపర్-6 కార్యక్రమాలు తీసుకువచ్చారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.15వేలు, తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15వేలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి రూ.3వేలు, చంద్రన్న బీమా రూ.10 లక్షలు, చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, అద్దె మగ్గం ఉన్నవారికి కూడా నేతన్న నేస్తం అమలుచేస్తారు. ఆప్కోను బలోపేతం చేస్తారు. వీవర్స్ శాలను లోకేష్ గారు ఏర్పాటుచేశారు. దీనిద్వారా ఎంతోమందికి ఉపాధితో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. స్వర్ణకారుల సంక్షేమ కోసం కార్పోరేషన్ ఏర్పాటుచేయడం జరుగుతుంది. ఇందులో ఒక్కటైనా జగన్ రెడ్డి చేశారా? ఎన్నికల తర్వాత విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి పాస్ట్ పోర్టులు సీజ్ చేయాలి. గొడ్డళ్లతో నరకడమే భారతి పని షర్మిల చెబుతున్నారు. వీరికి తగిన బుద్ధి చెప్పాలి.

Comments