జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం. .... కేసలి అప్పారావు

     మంగళగిరి (ప్రజా అమరావతి);

                    

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం.

             .... కేసలి అప్పారావు


                  

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన  5 - 18 సం.లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వం  జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు.

సామాజిక సేవ,సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, విద్య,

ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు సాహిత్యం, సంస్కృతి, సంగీతం,నృత్యం,పెయింటింగ్,

నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు,నాయకత్వ లక్షణాలు మొదలగు వాటిలో రాష్ట్ర జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన  భారత దేశానికి చెందిన  ఆసక్తి గల బాలలు జూలై 31 వ తేదీ లోపు  ఈ వెబ్సైట్  https://awards.gov.in  ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

కేంద్ర కమిటీ ద్వారా ఎంపిక కాబడిన బాలలకు రాష్ట్రపతి చేతులు మీదుగా జనవరి- 2025 లో   బహుమతి తో పాటు జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారని అప్పారావు తెలిపారు.

Comments