పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు.




పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు



పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేసిన టీడీపీ బృందం


ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ 


అమరావతి (ప్రజా అమరావతి);

పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీని కలిసి టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఏ.ఎస్ రామకృష్ణ  ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల  రామయ్య మాట్లాడుతూ

.... ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులా? ఇవి ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులేనా?.. పిన్నెల్లి విధ్వంసానికి అంతు లేకుండా పోయింది. 

మాచర్లలో ఉన్న ఎస్సైలు, సిఐలకు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పే పరిస్థితిలో లేరు. రెవెన్యూ, ఇతర అధికారులను సైతం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంట్రోల్ చేస్తున్నాడు. తురక కిషోర్, పిన్నెల్లి లాంటి వ్యక్తులు సమాజానికి చేటు.  రాడ్లు పట్టుకుని ఎదురొచ్చిన వాళ్లపై దాడులు చేయడమే తురక కిషోర్, పిన్నెల్లి పని. మాచర్లలో ప్రభుత్వ యంత్రాంగం పిన్నెళ్లికి పాదాక్రాంతం అయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో మెడ మీద కత్తి పెట్టి అన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నాడు. పోలీసుల అండతో దౌర్జన్యాలకు తెగబడ్డాడు. అంతులేని హింసకు తెరలేపాడు. ప్రశ్నించిన వారి గొంతులు కోశారు. టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేశారు. పోలింగ్ బూత్ లో బ్యాలెట్ ను ధ్వంసం చేస్తుంటే అడ్డుకున్న టీడీపీ నేతను చంపేందుకు యత్నించారు.  ప్రశ్నించిన మహిళను బూతులు తీట్టాడు. ఇలాటి రాక్షస నాయకులను వెంటనే అరెస్ట్ చేసి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చంద్రగిరిలో పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చి కుట్ర చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి.

తాడిపత్రిని సొంత సామ్రాజ్యంగా స్థాపించుకుని కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ కార్యర్తలపై దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారు.. కేతిరెడ్డిపై వెంటనే 307 సెక్షన్ కింద అరెస్ట్ చేసి శిక్షించాలి. 

రాజంపేటలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ చైతన్య తాడిపత్రికి రావాల్సిన అవసరం ఏముంది.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాలతో జేసీ నివాసంపై దాడి చేసిన డీఎస్పీ  అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Comments