కాకసనూరు పోలింగ్ సిబ్బందికి గిరిజన సంప్రదాయంలో ఘన స్వాగతం*.

 


*గోదావరి నది మధ్యలో ఉన్న కాకసనూరు గిరిజన తండా నుంచి*


*కాకసనూరు పోలింగ్ సిబ్బందికి గిరిజన సంప్రదాయంలో ఘన స్వాగతం* ఏలూరు (ప్రజా అమరావతి ):  కాకసనూరు పోలింగ్ సిబ్బంది ఊహించని పరిణామం ఎదురుకున్నారు. ఏలూరు జిల్లా, కోయిదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాకసనూరు పోలింగ్ కేంద్రం జిల్లా కేంద్రానికి సుమారు 180 కిమీ దూరంలో ఉంది. ఐ.టి.డి.ఎ కోట రామచంద్రపురంలో పరిధిలో ఉన్న ఈ పోలింగ్ కేంద్రం జిల్లాలో ఉన్న 1744 పోలింగ్ కేంద్రాలలో ఒకటి. కాకసనూరు తండా గోదావరి నది మధ్యలో ఉండడం వలన సరైన రవాణా సౌకర్యం, విద్యుత్ సదుపాయం లేదు, చరవాణి కూడా పనిచేయదు.  బాహ్యప్రపంచంతో సంభందం లేని కాకసనూరులో కొండరెడ్డి గిరిజన తెగ చెందిన పి.వి.టి.జి గ్రూపు వారు నివాసముంటారు. సార్వత్రిక ఎన్నికల దరిమిలా ఈ ప్రాంతంలో పేరంటలపల్లి, టేకుపల్లి, కాకసనూరు ఆవాసాలకు చెందిన 472  ఓటర్లు ఇక్కరున్నారు.  సిబ్బంది ఎన్నికల విధుల నిమిత్తం కాకసనూరు చేరుకోవాలంటే గోదావరి నది మీద పడవ ప్రయాణం తప్పనిసరి. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లాలో పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినా కాకసనూరులో ఎన్నికల విధులు నిర్వహించడం సిబ్బందికి ఇబ్బందే అని చెప్పచ్చు. అయితే కాకసనూరు గ్రామానికి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తే ఈ ప్రాంత కొండారెడ్డి గిరిజన తెగవారు వారి సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలకడం అనవయితీ. అయితే పోలింగ్ రోజుకి ఒకరోజు ముందుగా పోలింగ్ సిబ్బంది కాకసనూరు గిరిజన తండాకు  వస్తారని తెలుసుకొని సిబ్బంది వచ్చేవరకు ఎదురు చూసారు. రాత్రి సమయం అని కూడా చూడకుండా పోలింగ్ సిబ్బంది రాకకోసం ఎదురుచూసి గిరిజన సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికి సత్కరించారు. సందర్బంగా పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారి ప్రసాద్, ఎన్నికల సిబ్బంది కాకసనూరు గిరిజనులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్, సబ్ ఇన్స్పెక్టర్ యు. లక్ష్మీనారాయణ, విస్తరణ అధికారి యం. శ్రీహరి తదితరులు ఉన్నారు.Comments