కార్పొరేట్ పాలిటిక్స్ వద్దు... కమ్యూనిస్ట్లు ముద్దు.

 *ఆత్మకూరులొ వెల్లువలా ఎర్రజెండాపై అభిమానం*


*గెలుపు దిశగా కమ్యూనిస్టులు*


*భారీగా పాల్గొన్న జొన్నా అభిమానులు, పార్టీ శ్రేణులు* 


*కార్పొరేట్ పాలిటిక్స్ వద్దు... కమ్యూనిస్ట్లు ముద్దు**పన్నులు తగ్గించాలన్నా,  ఇళ్ల పట్టాలు కోసం పనిచేయాలన్న...  కమ్యూనిస్టులను గెలిపించండి*


*సిపిఎం మంగళగిరి అభ్యర్థి జొన్నా శివశంకర్*


మంగళగిరి/ఆత్మకూరు (ప్రజా అమరావతి);


*బూర్జువా పార్టీలొద్దు.... 2014 నుంచి ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలు... తెలుగుదేశం, వైసీపీలు మాకు అసలే వద్దు..... ప్రజల కోసం నిత్యం పోరాడే.. ఎర్ర జెండా బిడ్డ.. ఉండవల్లి హ్యాట్రిక్ సర్పంచ్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్.. జొన్న శివశంకర్ కు ఓటేసి గెలిపించుకుందాం.... మంగళగిరి నియోజకవర్గం మొత్తం... ఏ గల్లీల చూసిన దీని గురించే ముచ్చట్లు.... ఏ ఇద్దరిని కదిలించినా కమ్యూనిస్టుల పోరాట పటిమ గురించే మాటలు.... మంగళగిరిలో ప్రజలు కమ్యూనిస్టులకే... పగ్గాలు ఇవ్వనున్నారా...?  అంటే కమ్యూనిస్టు అభిమానులు అవుననే అంటున్నారు.*


*ఆత్మకూరులో ఎర్రజెండాపై అభిమానం వెల్లివిరిసింది.. వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఎదురేగి..  పూల వర్షం కురిపిస్తూ..  ఇండియా కూటమి సిపిఎం మంగళగిరి అభ్యర్థి.. జొన్నా శివశంకర్, సిపిఐ లోక్ సభ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కు స్వాగతాలు పలికారు*


*ఆత్మకూరులో ఏ గల్లి చూసినా... ఏ కూడలి చూసిన ఎర్రజెండా రెపరెపలే..... హారతులతో, పూల వానతో తమ అభిమానాన్ని చాటుకున్నారు*


*ఈ సందర్భంగా ఇండియా కూటమి అభ్యర్థులు జొన్నా శివశంకర్, జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారని... రూపాయి పెట్టి పది రూపాయలు సంపాదించుకుంటారని... వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు*


*కమ్యూనిస్టులకు ఎందుకు ఓటేయకూడదు..?..  డబ్బు మద్యం పంచరనా..?  నిజాయితీగా ఉంటారనా..? ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తారనా?  అరెస్టులకి భయపడరనా..? ప్రజా సమస్యలపై పోరాడి జైళ్లకు.. సంతోషంగా వెళ్తారనా..?.. ఎందుకు ఓటేయకూడదు మీ మనస్సాక్షిని అడగాలని అభ్యర్థులు ప్రజలకు.. సూచించడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు.*


*నిమ్మగడ్డ హయాంలో ఆత్మకూరులో.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని...  అభివృద్ధి జరగాలన్నా... ఇంటి పన్నుల భారం తగ్గాలన్నా... చెత్త మీద వేసే చెత్త పనులు తొలగించాలన్నా...ఇండియా కూటమి అభ్యర్థులు అసెంబ్లీకిజొన్న శివశంకర్ ను పార్లమెంటుకు జంగాల అజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు.*


ప్రజానాట్యమండలి కళాకారులు..నృత్యాలతో,పాటలతో, వాయిద్యాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేశారు.


ఈ కార్యక్రమంలో ఫకీరయ్య, కొలనుకొండ శివరామకృష్ణయ్య, పాశం రామారావు, సిపిఎం సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Comments