ప్రభుత్వ దంత కళాశాల మరియు ఆసుపత్రిలో PEDODONTICS విభాగంలో సీనియర్ రెసిడెంట్ ఖాళీ భర్తీకి

 

విజయవాడ (ప్రజా అమరావతి);

విజయవాడ లోని ప్రభుత్వ దంత కళాశాల మరియు ఆసుపత్రిలో PEDODONTICS విభాగంలో సీనియర్ రెసిడెంట్ ఖాళీ భర్తీకి ఈ నెల 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఇంచార్జి ప్రిన్సిపాల్ జె. నరేంద్రదేవ్ ఒక ప్రకటనలో తెలిపారు.  MDS ఉత్తీర్ణులైన వారు సీనియర్ రెసిడెంట్ ఖాళీకి అర్హులని, ఒక సంవత్సర కాలం పాటు పనిచేయవలసి ఉంటుందన్నారు.  ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు http://gdchvja.in/ వెబ్ సైట్ ను సందర్సించగలరని అయన తెలిపారు.  ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారని అర్హత గలిగి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చునని ప్రభుత్వ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ప్రిన్సిపాల్ జె. నరేంద్రదేవ్ తెలియజేసారు. 


Comments