పెమ్మసాని చంద్రశేఖర్..

   అమరావతి  (ప్రజా అమరావతి );      పెమ్మసాని చంద్రశేఖర్..


రెండేళ్ల కిందటి వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఆయన పేరు మార్మోగిపోతోంది. గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన పెమ్మసారి చంద్రశేఖర్ తన వైఖరితో, ప్రజలతో మమేకమయ్యే తీరుతో, తన నైపుణ్యాలతో, అన్ని సమస్యలపై, వాటి పరిష్కారంపై ఉన్న స్పష్టమైన అవగాహనతో అందరి వాడుగా, అందరి గౌరవాన్ని పొందిన వ్యక్తిగా మారిపోయారు. 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అఖండ విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అంతే కాకుండా,  కేంద్రంలో కూడా తెలుగుదేశం కీలక పాత్ర పోషించనుంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరనున్న నేపథ్యంలో బీజేపీ తరువాత కూటమిలో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం నిస్సందేహంగా కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది.

 దీంతో కేంద్ర కేబినెట్ లో స్థానం లభించేదెవరికి? అన్న చర్చ మొదలైంది. కేంద్రంలో మంత్రి పదవులను దక్కించుకునే వారిలో పెమ్మసారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు తనతో పాటు పెమ్మసానిని కూడా వెంటబెట్టుకు వెళ్లారు. దీంతో ఎన్డీయే సర్కార్ తో  పెమ్మసానికి మినిస్ట్రీ బెర్త్ కన్ ఫర్మ్ అయ్యిందన్న చర్చ జరుగా సాగుతోంది.

Comments