భారతీయ సంస్కృతిలో హస్త కళలు ఒక భాగం.






రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);




** భారతీయ సంస్కృతిలో హస్త కళలు ఒక భాగం


** కులవృత్తుల నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫారం కి తీసుకురావడం జరిగింది 



** వార్ధా, మహారాష్ట్ర స్వాలంబి గ్రౌండ్ నందు నిర్వహించిన తొలి వార్షిక కార్యక్రమం లో పాల్గొన్న పిఎం 


** వర్చువల్ కార్యక్రమం ద్వారా జిల్లా నుంచి పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు 


.. ఎంపీ డి.పురాందేశ్వరి 

.. జిల్లా కలెక్టర్ ప్రశాంతి 


మన భారతీయ సంస్కృతితో ముడిపడి వున్న హస్త కళలను కాపాడుకుంటూ ఆ వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సహాన్ని అందించే దిశగా  పి ఎం విశ్వకర్మ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని   ఎంపీ దగ్గుబాటి పురాందేశ్వరి,  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి లు పేర్కొన్నారు. 


 ప్రధానమంత్రి విశ్వకర్మ మొదటి ఏడాది పురోగతి  ప్రారంభ కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్వాలంబి గ్రౌండ్, వార్ధా, మహారాష్ట్ర  నుంచి పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపం నుంచి వర్చువల్ విధానంలో వీక్షించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ దగ్గుబాటి పురందేరేశ్వరి,  కలెక్టర్ పి. ప్రశాంతి పాల్గొని  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎం పి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ఆధునిక ఉపకారణాల్లో నైపుణ్యత, అభివృద్ధికి మార్గ సూచికని, నైపుణ్యం తోనే దేశం యొక్క నవనిర్మాణ దిశగా సాధ్యమవుతుందన్నారు. భారతీయ సంస్కృతిలో హస్త కళలు ఒక భాగం అన్నారు.   హస్తం కళలు పై ఆధారపడిన చేతి వృత్తి కళాకారులు  ఎదుర్కొనే వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారికి ఆయా హస్త కళల్లో నైపుణ్యత తో కూడిన శిక్షణ అందించి లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు.  వంశ పారంపర్యంగా వస్తున్న కుల వృత్తులు మన సంస్కృతితో ముడిపడి ఉండటంతో వాటికి ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా గత  ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమాల ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విశ్వకర్మ పథకం ద్వారా  రూ .500 ఉపకార వేతనం, శిక్షణ పూర్తయిన తర్వాత రూ .15 వేల  కిట్స్ అందించడం తో పాటు , బ్యాంకుల ద్వారా లక్ష రూపాయల రుణ సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో 13 హస్త కళలను గుర్తించడం జరిగిందన్నారు. 


ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ,  ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా కులవృత్తుల ప్రోత్సహించే ఉద్దేశంతో నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫారం కి తీసుకురావడం జరిగిందన్నారు. ఎంపిక కాబడిన ఆయా వృత్తులు వారు పంచాయితీలు ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్ కి  అక్కడ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ కి తదుపరి బ్యాంకు కు పంపడం జరుగుతుందన్నారు. వీరు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యంతో పాటు ఆన్లైన్ సౌకర్యాన్ని రిజిస్ట్రేషన్ నుంచి బిజినెస్ వరకు జిల్లా స్థాయి కమిటీ ఆద్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.


జిల్లాలో వివిధ వృత్తులకు సంబంధించి 1427 మంది ఎంపిక కాగా వీరిలో 1251 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని,  దరఖాస్తూ చేసుకున్నావారిలో మరో 1209 మంది కొత్తగా పేర్లు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. 


బి జే పి మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ పి ఎం విశ్వకర్మ పథకం లో శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్స్ ను అందించి రు. లక్ష రూపాయల రుణాన్ని కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా శిక్షణ పొందుతున్న చేతి వృత్తి కళాకారులు దినదిన ప్రవర్ధమానం చెంది వ్యాపారులుగా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు.


ఈ సందర్భంగా  జిల్లాలో 5 గురికి ఒక్కొక్కరికి రు. లక్ష రూపాయలు చొప్పున బ్యాంక్ ద్వారా మంజూరు చేసిన రుణాల చెక్ లను అందజేశారు.


ఈ కార్యక్రమంలో  సోము వీర్రాజు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డివి ప్రసాద్  , యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ ఎ. విశ్వేశ్వరరావు, ఎస్బీఐ ఆర్ ఎం శ్రీనివాసరావు, స్కిల్ డెవలప్మెంట్ జెడి శాంతి, శ్రీ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముసునూరి సునీల్, డిఎస్డిఓ కొండలరావు, ఓబిసి సతీష్, బి జెపి స్టేట్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి, విశ్వకర్మ ప్రోగ్రాం ఆర్గనైజర్ సత్య సాయి, డి ఆర్ డి ఎ పీడీ - ఎన్ వివిఎస్ మూర్తి,  లబ్దిదారులు పాల్గొన్నారు.



Comments