గ్రామాల్లో శానిటేషన్ వర్కర్స్ అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలి.

 


మచిలీపట్నం, సెప్టెంబర్ 17 (ప్రజా అమరావతి);


గ్రామాల్లో శానిటేషన్ వర్కర్స్ అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాల


ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.


జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, వైద్య, మెప్మా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఈరోజు నుండి జిల్లాలో ప్రారంభమైన స్వచ్ఛతాహిసేవ  క్రింద చేపట్టవలసిన కార్యక్రమాలు గురించి సమీక్షించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో సఫాయి మిత్ర సురక్ష శివిర్ అంశం క్రింద గ్రామాల్లో శానిటేషన్ సిబ్బంది అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి గూగుల్ ఫారంలో డేటా సేకరించాలన్నారు. తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రతి గ్రామంలో శానిటేషన్ వర్కర్స్ అందరికీ సాధారణ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించాలని, వైద్య పరీక్షల రిపోర్టులను బట్టి మరుసటి రోజు అందరికీ వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహింప చేయాలని అన్నారు. టెస్ట్ రిపోర్టులలో మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ, తదితర ప్రభుత్వపరమైన కేంద్ర రాష్ట్ర పథకాల క్రింద మెరుగైన చికిత్స అందించుటకు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కల్పించదానికి కృషి చేయాలన్నారు. శానిటేషన్ వర్కర్స్ కు ప్రాథమిక వైద్యం (ఫస్ట్ ఎయిడ్) పట్ల అవగాహన కల్పించాలన్నారు.


శానిటేషన్ సిబ్బందిలో గ్యాస్ కనెక్షన్ లేనివారు, తాగునీటి కుళాయి లేని వారు, ఇల్లు లేని వారి జాబితాలు తయారుచేసి, ప్రభుత్వపరంగా వివిధ పథకాల క్రింద వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.


"చెత్త నుంచి సంపద" అంశంలో జిల్లాలో మున్సిపాలిటీలలో ఈ- వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ నిర్వహించి ఇంటింటి నుంచి, అదేవిధంగా వివిధ శాఖల కార్యాలయాల నుంచి కూడా ఈ వేస్ట్ సేకరించాలని ఆదేశించారు.


శానిటేషన్ సిబ్బంది అందరికీ పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రమాద, సాధారణ భీమా పథకాల క్రింద భీమా చేయించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.


మచిలీపట్నంలో సైక్లోధాన్ (స్వచ్ఛ పరుగు) నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.


అనంతరం కలెక్టర్ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సి.హెచ్.సి వైద్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని వర్చువల్ గా కలెక్టర్ ఆదేశించారు.


ఈ సమావేశంలో డిపిఓ నాగేశ్వర నాయక్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జె గీతాబాయి, జెడ్పి సిఈఓ ఆనంద్ కుమార్, పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, ఎల్డిఎం జయవర్ధన్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్, మెప్మా పీడీ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments