అభివృద్ధి పనులకు శంఖుస్ధాపన చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి..

 *రూ. 170.15 లక్షలు విలువైన అభివృద్ధి పనులకు శంఖుస్ధాపన చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి..


*


*రూ. 23.40 కోట్లతో బొమ్ములూరు వరకు కృష్ణాజిల్లాలో గల రహదారి వెడల్పు పటిష్టపరచిన రహదారిని ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి...*


నూజివీడు/ఏలూరు, సెప్టెంబర్, 25 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు  మండలంలోని సీతారాంపురం, పల్లెర్లమూడి, మీర్జాపురం గ్రామాల్లో రూ. 170.15 లక్షలతో నిర్మించనున్న పలు  సిసి రోడ్ల పనులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి బుధవారం శంఖుస్థాపనలు చేశారు. అనంతరం రూ. 23.40 కోట్లతో బొమ్ములూరు వరకు కృష్ణాజిల్లాలో గల రహదారి వెడల్పు పటిష్టపరచిన రహదారిని మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారి అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో ఎక్కడచూసినా గోతులు పడిన రోడ్లు, అటువంటి రోడ్లపై ప్రయాణాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడేవారన్నారు. రవాణా, రహదారులు బాగుంటేనే అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గినతరవాత నుండి రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి చెప్పారు.  జిలాల్లోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలోని దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి తెలియజేసారు.  

       కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ జాన్ మోషే, ఆర్ డబ్ల్యూఎస్  డిఇ భాస్కరరెడ్డి, పంచాయితీరాజ్ డిఇలు స్థానిక నాయకులు, వివిద శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  


Comments