*గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ సాధించిన మెగాస్టార్ చిరంజీవికి ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్*
అమరావతి (ప్రజా అమరావతి)
: నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో తనదైన నటనతో, డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ సాధించిన సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరిట రికార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. మోస్ట్ ప్రొలిఫిక్ డాన్సర్ గా పద్మవిభూషణ్ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రదానం చేయడంపై ప్రశంసల జల్లు కురిపించారు. 537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూమెంట్లకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం, నటుడిగా, కళాకారుడిగా తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలను మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు.
addComments
Post a Comment