కనక దుర్గమ్మ అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు.


  అమరావతి (ప్రజా అమరావతి);


*కనక  దుర్గమ్మ  అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన  ముఖ్యమంత్రి శ్రీ  నారా చంద్రబాబు  చంద్రబాబు*


*ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు బుధవారం సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున  పట్టువస్త్రాలు సమర్పించారు.*


*శరన్నవరాత్రుల ఉత్సవాలలో విశిష్టమైన  అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం  రోజున శ్రీ సరస్వతి దేవి అలంకరణ లో ఉన్న కనక దుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున సంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించేందుకుగాను వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు రాజగోపురం వద్ద ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ పరివేష్టం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంగళ వాయిద్యాలతో అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను,చిత్ర పటాన్ని అందజేశారు.*


*ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, పార్లమెంటు సభ్యులు కేశినేని  శివనాథ్, శాసనసభ్యులు సుజనా చౌదరి, జిల్లా కలెక్టర్ డా. జి. సృజన, నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, ఆలయ ఈవో కెఎస్ రామారావు, తదితరులు ఉన్నారు.



Comments