విజయవాడ (ప్రజా అమరావతి);
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని 2024లో స్వచ్ఛ భారత్- స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన
కల్పించేందుకు, విజయవాడ విభాగంలోని ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం చుట్టూ మానవహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవాడలో 15.10.2024న జరిగింది. ఈ మానవహార కార్యక్రమానికి IRS ప్రధాన కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ శ్రీమతి సునీతా బిల్లా కూడా పాలుపంచుకున్నారు. అంతర్జాతీయ టైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్వి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీమతి సునీతా బిల్లా మాట్లాడుతూ- పరిశుభ్రత మరియు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యత గురించి, అది మానవాళికి ఎంత ముఖ్యమో, మన ఆరోగ్యానికి అది ఎందుకు అవసరమో చక్కగా వివరించి చెప్పారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్‌ని స్థాపించడంలో దాని పాత్ర గురించి నొక్కి వక్కాణించారు. ప్రతి వ్యక్తీ స్వచ్ఛత, పరిశుభ్రత ఎందుకు పాటించాలో కూడా ఈ కార్యక్రమం వేదికగా ఆమె వివరించారు. అలాగే హరిత భారత్ కోసం ప్రతిఒక్కరూ ఈ స్వచ్ఛత సేవాకార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని, చుట్టూ ఉన్న పర్యావరణాన్ని సంరక్షించడానికి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కుమారి సింధు తపస్వి మాట్లాడుతూ- పరిశుభ్రత అనేది మన ఆరోగ్యంతో పాటూ మనం చేసే పనులపైన, మన సమర్థత పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చెప్పారు. ఈ కార్యక్రమంలో నలంద కళాశాలకు చెందిన విద్యార్థులు, కేకేఆర్ గౌతమ్, గూడవల్లి మరియు సీఏ విద్యార్థులతో పాటూ నగరానికి చెందిన ఇతర సంస్థలు, కళాశాల విద్యార్థులు సైతం పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విజయవాడ జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కుమారి అభినయ ఎన్‌తో పాటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ శ్రీ దోనెపూడి విజయ్‌బాబు, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు శ్యామలాదేవీ, ఈశ్వరరావు, అంకమ్మ రావు, రామ్‌ప్రసాద్, రాఘవులు మరియు ఆదాయపన్ను విభాగంలోని ఇతర సిబ్బంది సైతం పాల్గొన్నారు.
addComments
Post a Comment