దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన.

 *దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన* 


 *క్యూలైన్లలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా.* 

 *గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు ఉన్నాయని భక్తుల సంతృప్తి.* 

 *రేపటి నుంచి క్యూ లైన్ లో భక్తులకు పాలు మజ్జిగ పంపిణీ.* 

 *ప్రతిరోజు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్* 

 *భక్తుల ప్రయోజనాలకే పెద్దపీట దేవాదాయ  శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.* 


 విజయవాడ, అక్టోబర్ 5 (ప్రజా అమరావతి);


 విజయవాడ దుర్గ గుడిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు,భక్తులకు కలిపిస్తున్న  సౌకర్యాలు,వసతులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  శనివారం సాయంత్రం ఆకస్మికంగా సమీక్షించారు.

 క్యూ లైన్ లలో భక్తులకు మంచినీళ్లు అందుతున్నాయా,  సమస్యలు ఏమైనా ఉన్నాయా అని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ  అమ్మవారి దర్శనం బాగా జరుగుతున్నారా లేదా అని క్యూలైన్లలో  నిలబడి పరిశీలించారు.

 ఈ సందర్భంగా  భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

తమకు గతంలో కంటే మరింత మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తోందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వసతులు కూడా  వసతులు కూడా మెరుగ్గా ఉన్నాయని మంత్రికి వివరించారు.

 ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.  అనంతరం దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై  ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు మూడు నాలుగు సార్లు భక్తుల నుంచి  ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, వారు సూచించిన ప్రకారం  అదనపు సదుపాయాలు కల్పనకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గారు భక్తుల సౌకర్యాలకు పెద్దపీటవేయమని పదేపదే సూచిస్తున్న విషయాన్ని మీ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. ఆదిశలోనే  ఉత్సవాలు జరిగే మిగిలిన రోజుల్లో మంచినీళ్లతో పాటు పాలు, మజ్జిగ కూడా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.


 *నదీమ తల్లి హారతుల్లో పాల్గొన్న మంత్రి.*

అమ్మవారి దర్శనానికి ముందు కృష్ణా నదికి ప్రతి నిత్యం ఇస్తున్న నవ హారతుల్లో మంత్రి పాల్గొన్నారు.

 ఈ హారతుల్లో  భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

 మంత్రి వెంట దేవదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, ఆలయ ఈవో  కె. ఎస్. రామారావు తదితరులు పాల్గొన్నారు.

Comments