పర్యాటక అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో త్వరలో గోల్ఫ్ కోర్స్.



 *పర్యాటక అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో త్వరలో గోల్ఫ్ కోర్స్*



 *అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు*


*'వైజాగ్‌ ఓపెన్‌ గోల్ఫ్‌-2024' విజేతలకు రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం*


*వైజాగ్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ -2024 విజేత అంగడ్ చీమా, రన్నరప్ అమాండ్ ఆర్ట్ లను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి దుర్గేష్*


*ప్రొఫెషనల్ గోల్ఫ్స్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ వేదికగా  టోర్నీలు నిర్వహిస్తున్న పీజీటీఐ*


*ఈ టోర్నీలో సత్తాచాటిన వారు ప్రైజ్ మనీ పొందటంతో పాటు తమ ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకునేందుకు, అంతర్జాతీయ టోర్నీలో అర్హత సాధించేందుకు దోహదపడుతుందని వివరించిన మంత్రి దుర్గేష్*


*క్రీడలు జీవితంలో భాగం కావాలి..మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించాలని సూచన*


విశాఖపట్నం (ప్రజా అమరావతి): కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం విశాఖపట్నం లోని ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వైజాగ్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ -2024 విజేతలకు బహుమానాలు అందజేసే కార్యక్రమంలో  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టోర్నమెంట్ విజేత అంగడ్ చీమా, రన్నరప్ అమాండ్ ఆర్ట్ లను మంత్రి  కందుల దుర్గేష్ అభినందించి ప్రైజ్ మనీ అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలు వెలుగొందాలన్న ఉద్దేశంతో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో  అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.


ప్రొఫెషనల్ గోల్ఫ్స్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ వేదికగా  ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఇండియా(పీజీటీఐ) ఆధ్వర్యంలో అక్టోబర్ 2 న లాంఛనంగా ప్రారంభం అయిన 'వైజాగ్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ 2024' నేషనల్ టోర్నమెంట్ నేటితో ముగిసింది.  దేశ విదేశాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు, ప్రొఫెషనల్స్‌తో పాటు ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు.

 

 ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ  ప్రతీ క్రీడాకారుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేయాలని, క్రీడలు జీవితంలో భాగం కావాలని సూచించారు.  ప్రతీ ఒక్కరు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని, క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. భారతదేశంలోని అత్యున్నత స్థాయి ప్రొఫెషనల్ గోల్ఫ్స్ ను ప్రదర్శించే పీజీటీఐ ప్రతిష్టాత్మక ఈవెంట్ ను సమర్థవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. ఈ టోర్నీతో దేశ, విదేశీ అగ్రశ్రేణి ఆటగాళ్లను ఆకర్షించడం ద్వారా  ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు.ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ (EPGC) విశాఖపట్నంతో పాటు భారతదేశంలో ప్రొఫెషనల్ గోల్ప్ ను అధికారికంగా మంజూరు చేసే సంస్థ అన్నారు. గోల్ఫ్ ఆటను మెరుగుపరిచే లక్ష్యంతో సేవలను అందించడంపై దృష్టి పెట్టే ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక గోల్ఫ్ కోర్స్ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత గోల్ఫ్ కోర్స్ కు ఇది వేదిక అయిందని వెల్లడించారు. ఇటువంటి టోర్నీ ద్వారా విశాఖ పర్యాటకాభివృద్ధి సాధిస్తుందన్నారు.  కష్టతరమైన  ఈ టోర్నీని నిర్వహించిన నిర్వాహకులకు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో సత్తాచాటిన వారు ప్రైజ్ మనీ పొందటంతో పాటు తమ ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకునేందుకు, అంతర్జాతీయ టోర్నీలో అర్హత సాధించేందుకు దోహదపడుతుందని మంత్రి దుర్గేష్ వివరించారు.



 కార్యక్రమంలో ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (పీజీటీఐ) సీఈవో ఉత్తమ్‌సింగ్‌ మండే, డైరెక్టర్ వికాస్ సింగ్, ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ కార్యదర్శి ఎంఎస్‌ఎన్‌ రాజు, రామకృష్ణ, దేశ విదేశీ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు..



Comments