"22 ,23, 24 తేదీలలో గుంటూరులో ఐఎంఏ 66వ రాష్ట్ర సదస్సు -డాక్టర్ టి .సేవ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ.
గుంటూరు (ప్రజా అమరావతి);
నవంబర్ 22 ,23, 24 తేదీలలో మూడు రోజులపాటు ఐఎంఏ 66వరాష్ట్ర సదస్సును గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ నిర్వహిస్తున్నట్టు ,రాష్ట్ర సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి సేవకుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర సదస్సును 16 సంవత్సరాల తర్వాత మళ్లీ గుంటూరులో నిర్వహించటం జరుగుతుందన్నారు. 2008లో డాక్టర్ ఎన్ .కిషోర్ సారధ్యంలో సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుండి 1500 మందికి పైగా వైద్యులు హాజరవుతారు అన్నారు. ఈ రాష్ట్ర సదస్సులో అతిథులుగా కేంద్రగ్రామీణ అభివృద్ధి , కమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఐఎంఏ జాతీయ అధ్యక్షులు ,డాక్టర్ ఆర్ వి అశోకన్,కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జె. నాయక్ తదితరులు పాల్గొంటారన్నారు .మొదటిరోజు కాన్ఫరెన్స్ లో అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఈసీజీ ,బి ఎల్ ఎస్ (సిపిఆర్) ఈకో కార్డియోగ్రఫీ తదితర అంశాలపై వర్క్ షాప్ జరుగుతుందన్నారు. రెండవ రోజు, మూడవ రోజు వివిధ విభాగాలకు చెందిన 70 మంది ప్రసిద్ధ వివిధ విభాగాలవైద్య నిపుణులు వివిధ ఆధునిక వైద్య విధానాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స పద్ధతులపై ప్రసంగిస్తారన్నారు. ఈ సీఎం ప్రోగ్రాం లో ప్రముఖ న్యూరాలజిస్ట్ లు,డాక్టర్ వి .రామ తారకనాథ్ , డాక్టర్ పి విజయ,ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ బి. సోమరాజు, డాక్టర్ పి .రమేష్ బాబు, డాక్టర్ పి . ఎన్.
ఎస్ హరిత, డాక్టర్ ఎన్. శ్రీకాంత్ ,ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనగాని మంజుల, ఆర్థోపెడిక్ సర్జన్స్ డాక్టర్ బి. నరేందర్ రెడ్డి, డాక్టర్ జె .నరేష్ బాబు, క్యాన్సర్ స్పెషలిస్ట్ లు డాక్టర్ ఎం జి నాగ కిషోర్, డాక్టర్ దుర్గాప్రసాద్ , డాక్టర్ టీ.వీ .శివరామకృష్ణతదితర వైద్య నిపుణులు ప్రసం
గిస్తారు అన్నారు . సమావేశంలో పాల్గొన్న ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జి. నందకిషోర్, ఐఎంఏ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఎన్ కిషోర్ మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వై. సుబ్బారాయుడు ,కార్యదర్శి డాక్టర్ బి. సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment