*తొలి సామాజిక తత్వవేత్త ఫూలే.. జడ్పీ చైర్మన్ క్రిష్టీనా
*
గుంటూరు (ప్రజా అమరావతి);
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజీ సమీపంలోని సిగ్నల్స్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహెని క్రిస్టినా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు, వందల ఏళ్లుగా అణచివేతకుగురైన బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి.. మహిళా సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు,మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు నిరుపమానమన్నారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్ గల్లా మాధవి ఎమ్మెల్సీలు కె ఎస్ లక్ష్మణరావు యేసు రత్నం పాల్గొన్నారు.
addComments
Post a Comment