కట్టుడు పళ్ళ ప్రత్యేక వైద్య నిపుణుల జాతీయ సదస్సు.

 *కట్టుడు పళ్ళ ప్రత్యేక వైద్య నిపుణుల జాతీయ సదస్సు


మంగళగిరి (ప్రజా అమరావతి);

ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో కట్టుడు పళ్ళ ప్రత్యేక వైద్య నిపుణుల జాతీయ సదస్సు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రోస్థోడాంటిక్ సొసైటీ ఆధ్వర్యంలో 52వ జాతీయస్థాయి ఇండియన్ ప్రోస్థోడాంటిక్ సొసైటీ సదస్సు జరుగుతుందని కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ టి కృష్ణమోహన్ తెలిపారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. ఈ సదస్సులో భారతదేశంలోని ప్రోస్థోడాంటిక్  రంగానికి ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. సదస్సులో 2000 మందికి పైగా ప్రోస్థోడాంటిక్ పాల్గొంటారని తెలిపారు. దేశ విదేశాల నుండి వైద్య నిపుణులు పరిశోధకులు పాల్గొని వారి అనుభవాలను పంచుకొంటారని చెప్పారు. ఇండియన్  ప్రోస్థో డాంటిక్ సొసైటీ జాతీయ కార్యదర్శి డాక్టర్ జంగల హరి మాట్లాడుతూ కట్టుడు పళ్ళ చికిత్స రంగంలో తాజా ఆవిష్కరణలు ఆధునిక పరికరాలు చికిత్స విధానాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. కట్టుడు పళ్ళ వైద్యం అనేది వ్యక్తుల జీవితానికి గౌరవం నూతన ఉత్తేజం ఇస్తుందని తెలిపారు. ఇది కేవలం దంత సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా రోగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే వైద్య పద్ధతి అని అన్నారు. ఇండియన్ ప్రోస్థోడాంటిక్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి డాక్టర్ భవన్ చంద్ మాట్లాడుతూ ప్రజలలో కట్టుడు పళ్ళ వైద్యంపై అవగాహన పెంపొందించడం అలాగే వైద్యరంగంలో తాజా పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సదస్సులో నూతన విధానాలు పరికరాలు చికిత్స పద్ధతులపై ప్రదర్శనలు దేశ విదేశాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, నిపుణుల ప్రసంగాలు, వైద్య విద్యార్థుల పరిశోధనాత్మక ప్రదర్శనలు, ఉంటాయని తెలిపారు. ఈ సదస్సుకు మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మహేంద్ర నాథ్ రెడ్డి, జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహేష్ లహోరి, ఇతర ప్రముఖ సీనియర్లు వస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి శేషారెడ్డి, డాక్టర్ వై రవిశంకర్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ షేక్, డాక్టర్ సిహెచ్ విఎన్ సాయికుమార్, డాక్టర్ చిరామాన సందీప్, డాక్టర్ సిహెచ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

Comments