*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంలో సీ ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరో కలికితురాయి*
*సీ ప్లేన్ డెమో ప్రారంభోత్సవంలో వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్*
*జల మార్గం ద్వారా ఆకాశమార్గంలో పయనించే సీప్లేన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్*
*పర్యాటకులకు మధురానుభూతిని కలిగించే సీప్లేన్లు త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న మంత్రి దుర్గేష్*
*సీ ప్లేన్ పది కాలాలపాటు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్*
*టూరిజం సర్క్యూట్ల ద్వారా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్
*
*దేవాలయ దర్శనంతో పాటు ప్రకృతి సౌందర్యంలో ప్రయాణికుడు విహరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించిన మంత్రి దుర్గేష్*
విజయవాడ (ప్రజా అమరావతి): ఏకకాలంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమ్మిళితం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంలో సి ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరో కలికితురాయి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.. శనివారం ఉదయం విజయవాడలోని పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన ''సి ప్లేన్'' డెమో ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు..విజయవాడ నుండి శ్రీశైలం వరకు ప్రారంభించిన సీప్లేన్ సర్వీస్ ల కార్యక్రమం దిగ్విజయంగా సాగింది.. సీ ప్లేన్ కార్యక్రమంతో పర్యాటక రంగంలో మరింత ముందుకు వెళ్తామన్నారు.. సిప్లేన్ పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తుందని మంత్రి వివరించారు..
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సాంకేతిక విప్లవం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న నిరంతర కృషివలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు.. పరిపాలన సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు..
సీ ప్లేన్ డెమో అద్భుతమైన ఆవిష్కరణ కార్యక్రమమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.. అధికారంలోకి వచ్చినటువంటి నాలుగు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం అనేక సంస్కరణలు చేపడుతూ ఒక పక్కన పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ మరో పక్కన అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు పరుగులు తీయిస్తున్నారన్నారు..
*ఈ సందర్భంగా మంత్రి ఇంకా ఏమన్నారంటే ...*
ఇప్పటివరకు జలయానం, ఆకాశయానం చేశాం.. ఇవాళ కొత్తగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో జలంతో పాటు ఆకాశంలో వెళ్లటం ప్రారంభిస్తున్నాం.. జల మార్గం ద్వారా ఆకాశమార్గంలో పయనించే సీప్లేన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది . ఒక పక్కన విమానయాన శాఖకి, మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ కి కూడా చాలా గర్వకారణమైనటువంటి అంశంగా భావిస్తున్నాం..
974 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..అదేవిధంగా కృష్ణా, గోదావరి, పెన్నా లాంటి సజీవనదులున్న ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్.. అంతేగాక అద్భుతమైన అటవీ సంపద, ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలిచే అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు.. ఇలా చూసుకుంటే పర్యాటక రంగానికి కావలసిన అన్ని రకాల హంగులున్నటువంటి ఏకైక ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే..
గడిచిన ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని సమూలంగా నాశనం చేసిన దుర్మార్గ ప్రభుత్వాన్ని చూసాం.. పర్యాటక రంగాన్ని పట్టాలెక్కించేందుకు, పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, అద్భుతమైన ప్రగతిని చూపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. కేంద్రం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న సహకారం తో రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తాం..
సీ ప్లేన్ కార్యక్రమాన్ని సుస్థిరంగా కొనసాగించేందుకు , వయబుల్ చేసుకునేందుకు రాబోయే రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తాం . అరకు వ్యాలీ, శ్రీశైలం, తిరుపతి, నది తీర సమీపంలోని రాజమహేంద్రవరం, కోనసీమ లాంటి ప్రాంతాల్లో నీటి మీద ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తాం.ఆ చుట్టుపక్కల ఉండే పచ్చని పర్యాటకాన్ని పర్యాటకులు అనుభూతి చెందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.టూరిజం సర్క్యూట్ల ఏర్పాట్ల ద్వారా పర్యాటకుడు రెండు మూడు రోజులు పర్యాటక ప్రాంతాల్లో గడిపేలా ప్రణాళికలు తయారు చేశాం. దేవాలయ దర్శనం తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని కూడా పర్యాటకుడు విహరించేలా సమగ్ర ప్రణాళిక తయారు చేస్తున్నాం అని మంత్రి అన్నారు..
తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రగతిని చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం పదికాలాలపాటు నిలబడాలని కోరుకుంటున్నానని మంత్రి ఆకాంక్షించారు. నీవు నేను మనం..మనం మనం జనం ..జనం జనం ప్రభంజనం ఈ కూటమి ప్రభుత్వం వెనకాల నిలబడిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు...
కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని , రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి, ఐ అండ్ ఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సెక్రటరీ సురేష్ కుమార్ , టూరిజం శాఖ సెక్రెటరీ వినయ్ చంద్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, విమానయాన శాఖకు సంబంధించిన అధికారులు, ఔత్సాహికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment