తాడేపల్లి (ప్రజా అమరావతి);
*తాడేపల్లి మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా వన సమారాధన*
*ఇప్పటం మామిడి తోటలో ఘనంగా వన సమారాధన*
తాడేపల్లి మండలం ఇప్పటం
గ్రామంలోని మామిడి తోటలో ఆదివారం తాడేపల్లి మండల
గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు
డాక్టర్ పలగాని శ్రీనివాసరావు
ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనస మారాధన నిర్వహించారు
వనసమారాధనలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వనసమారాధన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గౌడ జాతి అంటే కళ్ళు గీతకు వెనుకబడిన వర్గంగా కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే పెద్ద కులమని అన్నారు.గతంలో సర్దార్ పాపారాయుడు యొక్క పౌరుషం
సర్దార్ గౌతు లచ్చన్న ధైర్యంతో గౌడ కులం చాలా ముందుకొచ్చిందని అన్నారు.రాబోయే రోజుల్లో గౌడ జాతి ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తామ
ని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గౌడ జాతి కీలకంగా పాలుపంచుకుంటుందని అన్నారు.
ప్రముఖ సినీనటుడు తల్వార్ సుమన్ ఆత్మీయత, ఐక్యతకు ప్రతీక వన సమారాధన అని
అన్నారు.భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలని నిగూఢ సందేశాన్ని వన సమారాధన ద్వారా తెలియజేయడం జరుగుతుందని
అన్నారు.ఈ వన సమారాధనలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ గౌడ జాతి కులం యొక్క నాయకత్వం పెరిగిందని అన్నారు. రాజకీయంగా అవకాశాలు ఎక్కువగా పెరిగాయని అన్నారు. గౌడ జాతి కులంలో చాలామంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కాగలిగారని అన్నారు. గౌడ కులం మద్దతుతో మాకు రాజకీయంలో గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ విధంగా వన సమారాధన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్,మాట్లాడుతూ
అందరూ ఏకతాటిపై ఉండి కలిసి ముందుకు వెళ్లాలని అన్నారు.
సోదర భావంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విద్యను ప్రోత్సహించాలని అన్నారు.తాడేపల్లి మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పలగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో తాడేపల్లి మండల గౌడ సంఘం ఎనిమిదవ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్, శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రముఖ సినీ నటుడు తల్వార్ సుమన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ,పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కాగితా కృష్ణ ప్రసాద్, పలువురు గౌడ సంఘం రాష్ట్ర జిల్లా మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో
కౌండిన్య ఎడ్యుకేషల్ ట్రస్ట్ చైర్మన్ ఈ వి నారాయణ,తాడేపల్లి
మండల గౌడ సంఘ నాయకులు లచ్చి తులసి దాస్,కంచర్ల కాశయ్య,పలగాని నాగబాబు,
ఐ ఎఫ్ ఎస్ అధికారి శివప్రసాద్,
తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment