మంగళగిరిలో "డార్జిలింగ్ న్యూ డిజైర్" కారు లాంచింగ్...

 *మంగళగిరిలో "డార్జిలింగ్ న్యూ డిజైర్" కారు లాంచింగ్...*


మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి ఎన్ఆర్ఐ వద్ద జయలక్ష్మి మారుతి సుజుకి ఎరినా షోరూమ్ లో బుధవారం మారుతి సుజుకి సంస్థ నూతనంగా డార్జిలింగ్ న్యూ డిజైర్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ముఖ్యఅతిథిగా మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయసారథి హాజరై కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ పి శరత్ మాట్లాడుతూ మారుతి సుజుకి సంస్థ నుండి వచ్చిన న్యూ డిజైర్ కారును కంపెనీ అప్గ్రేడ్ చేసి మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందన్నారు. న్యూ డిజైర్ కారులో ఫైవ్ స్టార్ రేటింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్, సన్రోప్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయన్నారు. నేటి నుంచి బుకింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ దాసరి నాగన్న, మంగళగిరి బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రాజశేఖర్, ఐసిఐసిఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ భార్గవ్, హెచ్ డీ బీ స్టేట్ ఏరియా సేల్స్ మేనేజర్ కే సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 


Comments