అమరావతి (ప్రజా అమరావతి);
భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము , ఎయిమ్స్ మంగళగిరి మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ. ఎస్. అబ్దుల్ నజీర్ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు , కేంద్ర ఆయుష్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శ్రీ. ప్రతాపరావు జాదవ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రి శ్రీ. సత్య కుమార్ యాదవ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మంత్రి శ్రీ. నారా లోకేశ్ అతిథులుగా హాజరయ్యారు.
భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము , అధ్యాపకులు మరియు బంగారు పతక విజేతలందరితో గ్రూప్ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆడిటోరియం వద్దకు అధ్యాపకులు మరియు స్నాతకోత్సవ విద్యార్థులచే అకాడమిక్ ప్రొచెస్సిఒన్ జరిగింది. కేంద్ర ఆయుష్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ. ప్రతాపరావు జాదవ్ ఎయిమ్స్ మంగళగిరికి అధ్యక్షత స్థానం వహిస్తూ, డైరెక్టర్ అభ్యర్థన మేరకు స్నాతకోత్సవం ప్రారంభించి, స్వాగత ప్రసంగం చేశారు. డైరెక్టర్ & CEO డా. (ప్రొఫె.) మధబానంద కర్ ఎయిమ్స్ మంగళగిరి పురోగతి నివేదికను సమర్పించారు మరియు ముఖ్య అతిథి శ్రీమతి. ద్రౌపది ముర్ము ని మరియు అతిథులను సత్కరించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, ఆసేవలలో శ్రేష్ఠతను సాధించడానికి వైద్య శాస్త్రం మరియు సాంకేతికత సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసారు. ఎయిమ్స్ మంగళగిరి అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత, రాష్ట్రపతి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈరోజు డిగ్రీలు అందుకున్న యువ వైద్యులందరికీ ఆమె హృదయపూర్వక అభినందనలు తెలియచేసారు. గ్రాడ్యుయేట్‌లలో మూడింట రెండొంతుల మంది యువ మహిళా డాక్టర్లు ఉన్నార
ని, "వైద్య వృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం మరియు వారి గణనీయమైన సహకారం మనం నిజంగా అభివృద్ధి చెందిన సమాజంగా మారుతున్నామని నిరూపిస్తున్నాయి" అని ఆమె నొక్కి చెప్పారు.
ఆరోగ్య మంత్రి శ్రీ. ప్రతాప్రావు జాదవ్ తో పాటు శ్రీ. సత్యకుమార్ యాదవ్ 49 మంది MBBS విద్యార్థులకు మరియు 04 పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఎయిమ్స్ మంగళగిరి-సెంటర్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (CMET) బ్రోచర్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. డీన్ అకడమిక్స్ శ్రీమంత కుమార్ దాష్ కృతజ్ఞతలు తెలిపారు. స్నాతకోత్సవం ముగిసినట్లు శ్రీ. ప్రతాపరావు జాదవ్ అధికారికంగా ప్రకటించారు. పోలీస్ బ్యాండ్ వారు జాతీయ గీతంతో వేడుక ముగింపు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వివిధ అధికారులు, ఎయిమ్స్ మంగళగిరికి చెందిన ఇన్‌స్టిట్యూట్ బాడీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది మరియు గ్రాడ్యుయేషన్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
addComments
Post a Comment