జాతీయస్థాయిలో ఆర్టీసీల క్రీడా పోటీలు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. నిర్వహించడం గొప్ప విషయం ---ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ.

 జాతీయస్థాయిలో ఆర్టీసీల  క్రీడా పోటీలు 

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. నిర్వహించడం గొప్ప విషయం 

---ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ


విశాఖపట్నంలో 3 రోజుల పాటు అఖిల భారత రవాణా సంస్థల క్రీడా పోటీల నిర్వహణ 

జాతీయ స్థాయిలో ఆర్టీసీల క్రీడా పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో  ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. నిర్వహించడం గొప్ప విషయం 

ఘనంగా ప్రారంభమైన  క్రీడా పోటీలు 

జెండా ఎగురవేసి ప్రారంభించిన ముఖ్య అతిధి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.  ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారు

ప్రత్యేక అతిధులుగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. , విశాఖ రేంజ్ DIG శ్రీ గోపినాథ్ జెట్టి, జోనల్ ఛైర్మన్ శ్రీ దొన్ను దొర మరియు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు 

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ,& ఏ.ఎస్.ఆర్.టి.యు. సంయుక్త ఆధ్వర్యంలో  జరుగుతున్న క్రీడా మహోత్సవం 

ఈ వేడుకలు విశాఖలో జరిపించడానికి విశేష కృషి చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ A.P &, Vice Chairman ASRTU & Managing Director , APSRTC  సిహెచ్. ద్వారకా తిరుమల రావు , ఐ. పి. ఎస్. 

పోలీసు పేరేడ్ గ్రౌండ్స్, కైలాసగిరి, విశాఖపట్నం వేదికగా మొత్తం 13 కేటగిరీలలో పోటీల నిర్వహణ 

వివిధ రాష్ట్రాల  నుండి పాల్గొన్న 404  మంది  ఆర్టీసీ క్రీడాకారులు  

 విశాఖపట్నం (ప్రజా అమరావతి);

విశాఖపట్నం వేదికగా అఖిల భారత రవాణా సంస్థల క్రీడా పోటీలను ఈ రోజు అనగా 6.12.2024 న ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ ప్రారంభించారు. దేశంలోని సుమారు వివిధ రాష్ట్రాలకు చెందిన  19  ఆర్టీసీలకు చెందిన ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 


‘అఖిల భార‌త ప్రజా ర‌వాణా  సంస్థల క్రీడా మహోత్సవానికి  గౌరవ అతిధిగా రాష్ట్ర డి.‌జి.‌పి,  ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఎం.డి. మరియు ASRTU వైస్ ఛైర్మన్ శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు గారు, ఐ.పి.ఎస్ హాజరయ్యారు.  ప్రత్యేక అతిధులుగా శ్రీ దొన్ను దొర, APSRTC, విజయనగరం జోనల్ ఛైర్మన్, మరియు శ్రీ టి.సూర్య కిరణ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ASRTU మరియు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు , జోనల్ డైరెక్టర్లు  పాల్గొన్నారు.  అంగరంగ వైభవంగా ఈ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. DGP & ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఎం.డి. మరియు ASRTU వైస్ ఛైర్మన్ శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు , ఐ.పి.ఎస్ అధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నవి. 

ముందుగా ASRTU ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ టి.సూర్య కిరణ్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి క్రీడలు దాదాపుగా 4 దశబ్ధాల తరవాత జరుగుతున్నాయని, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. మాత్రమే చేయగలదని నమ్మి, సంస్థ  ఎం.డి. శ్రీ  సిహెచ్. ద్వారకా తిరుమల రావు , ఐ.పి.ఎస్ ని సంప్రదించగానే ఆయన విశాఖపట్నంలో ఈ వేడుకలు నిర్వహిద్దామని సూచించారని తెలిపారు. అన్ని ఆర్టీసీల ఉద్యోగులందరూ ఈ రోజు కలిసికట్టుగా ఇలా ఒకే చోట కలిసి పోటీల్లో పాల్గొనడం చాలా కన్నులవిందుగా ఉందన్నారు.  ప్రతిసారి ఇలాంటి వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని , మరొక్కసారి అవకాశం వస్తే ఇక్కడే పోటీలు జరుపుతామని వివరించారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులందరూ తమ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 

ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ “ ఆర్టీసీ సంస్థల నడుమ స్నేహ పూర్వక వాతావరణంలో జరుగుతున్న ఈ క్రీడల నిర్వహణ వలన  రవాణాలో పోటీతో పాటు స్నేహంగా కూడా కలిసే ఉంటామనే  గొప్ప సందేశం అన్ని ఆర్టీసీలకు చేరువయ్యిందని పేర్కొన్నారు.   సరదా వాతావరణంలో జరుగుతున్న ఈ  క్రీడలలో క్రీడాకారులు గెలుపు, ఓటమిలను  సమానంగా స్వీకరించాలని తెలిపారు. ఈ పోటీల నిర్వహణ ఇక్కడ విశాఖపట్నంలో జరిగేందుకు డి‌జి‌పి మరియు సంస్థ ఎం.డి. శ్రీ  సిహెచ్. ద్వారకా తిరుమల రావు , ఐ.పి.ఎస్ మరియు శ్రీ టి.సూర్య కిరణ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ASRTU ఎంతో కృషి చేశారని వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు మంచి చేయడమే కాకుండా ఎంతో అనుభవంతో, చాకచక్యంతో ఆర్టీసీ ఎం.డి. బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన సమన్వయంతో ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తానని పేర్కొన్నారు. 

అనంతరం సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు , ఐ.పి.ఎస్ మాట్లాడుతూ “ ఈ రోజు విశాఖపట్నంలో సుమారు 10 రాష్ట్రాల  ఆర్టీసీల ఉద్యోగులు క్రీడా పోటీలకు హాజరవ్వడం ఆనందంగా ఉందన్నారు. వారిలో 127 మండి మహిళా ఉద్యోగులు ఉండడం నిజంగా గొప్ప విషయమని తెలిపారు.  ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం కష్టపడుతూ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని, బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా  అనేక గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారని  తెలిపారు.  అదే విధంగా కండక్టర్లు విధుల్లో అనేక రకాల ప్రయాణికులతో నిత్యం మర్యాద పూర్వకంగా నడుచుకుంటూ, ఒత్తిడిని జయించి డ్యూటీలు చేస్తున్నారని వివరించారు. 

 ఇలాంటి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడమే కాకుండా ఈ రోజు ఇలా ఈ క్రీడా పోటీలకు రావడం వారికొక మానసిక ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్ని కలిగిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా స్నేహంగా మసులుకొని పోటీతత్వంతో గెలుపుని ఆస్వాదించాలని వ్యాఖ్యానించారు.  చివరిగా అన్ని టీమ్ లకు అభినందనలు  తెలియజేసి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి టీమ్ ఎక్కువ మెడల్స్ గెలుచుకోవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

విజయనగరం జోనల్ ఛైర్మన్ శ్రీ దొన్ను దొర మాట్లాడుతూ “ ఈ క్రీడలు తమ ప్రాంతమైన ఈ విశాఖలో జరగడం నిజంగా ఆనందంగా ఉందని, క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ఆడాలని తెలిపారు.  ఆర్టీసీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అధికారులు, ఉద్యోగులు  కలిసి నిరంతరం శ్రమిస్తున్నారని  ఎం.డి. ఆధ్వర్యంలో ఆర్టీసీ మరింత ప్రగతి సాధించాలని పేర్కొన్నారు. 

అనంతరం సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు , ఐ.పి.ఎస్,  విజయనగరం జోనల్ ఛైర్మన్ శ్రీ దొన్ను దొర, ASRTU ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ టి.సూర్య కిరణ్ మరియు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అందరి సమక్షంలో  సంస్థ ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ రావు  800 మీటర్ల పురుషుల  పరుగు పందెం పోటీలను  క్లాప్ కొట్టి ప్రారంభించారు . 

సంస్థ ఛైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ రావు  మరియు డి‌జి‌పి & ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు , ఐ.పి.ఎస్ ఇరువురూ సంయుక్తంగా కలిసి ఈ 800 మీటర్ల పురుషుల  పరుగు పందెం విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన NWKRTC ఉద్యోగి శ్రీ ఏ.ఆర్. చంద్ర శేఖర్, ద్వితీయ స్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్ TC ఉద్యోగి శ్రీ అమిత్ శైని లను మెడల్స్ తో సత్కరించారు. 

ఏ‌పి‌ఎస్‌ఆర్‌టి‌సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) జి.వి.రవివర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) శ్రీ ఏ. అప్పల రాజు,   ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (జోన్-1) శ్రీ ఏ. విజయకుమార్,  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (జోన్-1I) శ్రీ జి. విజయరత్నం తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

3 రోజులపాటు జరగనున్న ఈ జాతీయ స్థాయి  క్రీడలలో షాట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో, లాంగ్ జంప్, 100, 200, 400, 800, 1500 పరుగు పందెం, ఫాస్ట్ వాక్ వంటి విభాగాల్లో ఉద్యోగులు పాల్గొంటున్నారు.  





 సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) జి.వి.రవివర్మ ఆధ్వర్యంలో  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (జోన్-1) శ్రీ ఏ. విజయకుమార్, విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ బి.అప్పల నాయుడు, డిప్యూటీ సి.టి.ఎం.         శ్రీ జి.సత్యనారాయణ, డిప్యూటీ సి.పి.ఎం.(విజయనగరం జోన్) శ్రీమతి సుధా బింధు,  డిప్యూటీ సి.ఎం.ఇ       శ్రీ కె. రాజ శేఖర్,  అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారి  శ్రీమతి కె.పద్మావతి, విజిలెన్స్ & సెక్యూరిటి ఆఫీసర్ (జోన్-1) శ్రీ IVVP దుర్గా ప్రసాద్ మరియు ఇతర అధికారులు ఈ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. 

ఈ క్రీడా పోటీలలో నిర్వహించిన ప్రత్యేక పోలీసు బ్యాండ్, సెక్యూరిటి సిబ్బంది మరియు వివిధ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల క్రీడాకారులు నిర్వహించిన MARCH-PAST అందరినీ విశేషముగా ఆకట్టుకున్నవి.

Comments