మాజీ డిజిపి, సిఐడి పీవీ సునీల్ కుమార్ దళిత నమ్మక ద్రోహి.

  మాజీ డిజిపి, సిఐడి పీవీ సునీల్ కుమార్ దళిత నమ్మక ద్రోహి


  అమరావతి (ప్రజా అమరావతి);

ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి, చైర్మన్ జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్, ఒక ప్రకటనలో మాట్లాడుతూ,

జగన్మోహన్ రెడ్డి  క్రైస్తవ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారిని వాడుకొని, వారిని  ఇరికించేసినాడు,  మాజీ ఎస్పీ విజయపాల్, నందిగాం సురేష్, బోరుగడ్డ అనిల్ కుమార్, సంజయ్ కుమార్, పీవీ సునీల్ కుమార్ ఇలా చూస్తే దళిత క్రైస్తవ బ్యాగ్రౌండ్ ఉన్న వారే ఎక్కువ కనబడుతున్నారు, చాలామందికి బెయిల్ కూడా దొరక్కుండా జైల్లో నే మగ్గుతున్నారు, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని అనుకుని అందరూ మా వాడు, మా వాడు అనుకొని 98% క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు, కృతజ్ఞత లేని జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు చాలా అన్యాయం చేశాడు. ఎన్నికల సమయాలలో పీవీ సునీల్ కుమార్ దళిత జాతిని అడ్డం పెట్టుకుని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ, తను మాత్రం సిఐడి డీజీపీగా ప్రమోషన్ పొందాడు, సునీల్ కుమార్ దళిత్ జాతికి చేసింది సున్నా, ఇప్పుడు ఆయన మీద విచారణ ప్రారంభమయ్యేసరికి సోషల్ మీడియాలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆర్మీలో చేరండి అని ప్రకటనలు చేస్తున్నాడు, ఇలాంటివారిని నమ్మి మోసపోకూడదని ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి, దళిత సమాజానికి సూచించారు.

Comments