అగ్రరాజ్యాల మాదిరిగా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు, టెక్నాలజీతో ప్రభుత్వ సేవలు, రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం.

 అగ్రరాజ్యాల మాదిరిగా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు, టెక్నాలజీతో ప్రభుత్వ సేవలు, రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం

అమరావతి (ప్రజా అమరావతి),

ఆంధ్రప్రదేశ్  జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి,  ఒక ప్రకటనలో మాట్లాడుతూ, వాట్సాప్ తో పౌర సేవలు 


అందించడం, వాలంటీర్ వ్యవస్థ కంటే కూడా తక్కువ ఖర్చుతోను ,సులువుగాను, సమర్థవంతంగానూ రాష్ట్ర ప్రజలకు సేవలు అందుతాయని, చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు తన యొక్క ఆలోచన, ప్రతిభతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారనుటకు ఇది నిదర్శనం అని ప్రొఫెసర్ జోసెఫ్ కొనియాడారు, ఇప్పటివరకు ఇలాంటి టెక్నాలజీని కార్పొరేట్ సెక్టార్, అగ్ర రాజ్యాలు మాత్రమే వాడే వని, ఇప్పుడు ప్రజాసేవలకు ప్రభుత్వాలు వినియోగించడం వలన ప్రజలకు సమయం, ధనం వృధా కాకుండా ప్రజలు ఉన్న చోటు నుంచే వారి చేతిలో మొబైల్ తో సేవలు పొందగలుగుతారని ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి అన్నారు

టెక్నాలజీ వాడుకోవడానికి భయపడక్కర్లేదని సైబర్ అటాక్స్ ని తట్టుకునే సెక్యూరిటీ కూడా ఉంటుందని, మన యొక్క అజాగ్రత్త వలన నే, సైబర్ నేరగాళ్లకు చిక్కుకుంటామని జోసెఫ్ తెలిపారు, మన ఇంటిలో కరెంటు కూడా ప్రాణాలు తీసేస్తుందని అయినప్పటికిని జాగ్రత్త తీసుకుని గోడలు నిండా వైర్లు ఉంటాయని, ఆ విధంగానే టెక్నాలజీని ఉపయోగించుకొనుటవలన ప్రభుత్వానికి కూడా వేగంగా సేవలను ప్రజలకు అందించడానికి వీలవుతుందని తెలిపారు.

టెక్నాలజీ చాలా సులువైనదని, చదువు రాని వారు కూడా ఇప్పుడు వాట్సఆప్ వాడుతున్నారని, నేర్చుకుంటే చాలా సులువుగా ప్రజలు ప్రభుత్వ సేవలు అందుకోవచ్చు అని తెలిపారు.

Comments