*గులాబీ కారును ముందుకు నడిపించేది ఎవరు?*
హైదరాబాద్:జనవరి 08 (ప్రజా అమరావతి);
ఫార్ములా ఈ-రేసు కేసులో దారులన్నీ మూసుకు పోతున్న పరిస్థితి. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని.. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఓ అంచనాకు వచ్చినట్లు కనిపిస్తున్నాయ్. ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులకు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.
కేటీఆర్ అరెస్ట్ అయితే అనే ఆలోచనే.. వారికి నిద్ర లేకుండా చేస్తోంది. అన్నీ తానై, అన్నింటికి తానై కారును ముందుకు నడిపి స్తున కేటీఆర్ అరెస్ట్ అయి తే..?పార్టీ వ్యవహారాలు చూసుకునేది ఎవరు..? స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలతో పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరు? అని గులాబీ నేతల్లో గుసగుస లు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్‌గా పావులు కదులు తున్నాయనే ప్రచారం జరుగుతోంది. వివాదం ఏదైనా కేటీఆర్ పేరే ప్రధానంగా వినిపిస్తున్నట్లు కనిపిస్తోంది
సీన్. దాదాపు ఆరుసార్లు కేటీఆర్‌ను టార్గెట్ చేసు కొని.. సర్కార్ పావులు కదిపిందనే ప్రచారం జరుగుతోంది కూడా ! గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ.. ప్రభుత్వం విచారణ కమిటీ లు వేసింది. దీంతో సరికొత్త అంశాలు.. రాష్ట్ర రాజకీ యాల్లో హాట్ టాపిక్‌గా మారాయ్.
మొదట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో కేటీఆర్ సూత్రధారిగానే అధికారులు పనిచేశారనే ప్రచారం జరిగింది. కేటీఆర్‌ను ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని.. ఓ దశలో గులాబీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అయ్యా య్. ఆ తర్వాత లగచర్ల ఘటన.. రాష్ట్ర రాజకీయా ల్లోనే కొత్త చర్చకు దారి తీసింది.
సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియో జకవర్గంలో.. భూసేకరణ విషయంలో గిరిజన రైతులు అధికారులపై దాడి వెనక కేటీఆర్ కుట్ర ఉందనే అభియోగాన్ని.. పోలీసులు మోపే యత్నం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
addComments
Post a Comment