తాడేపల్లి (ప్రజా అమరావతి);
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు, సిబ్బందికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, విఆర్ కృష్ణతేజ మైలవరపు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్లు, డ్రైవర్లు, హౌస్ కీపింగ్ సిబ్బందికి కమిషనర్, విఆర్ కృష్ణతేజ తన సొంత ఖర్చులతో సిబ్బందికి బట్టలు, స్వీట్స్ కొని అందజేసి, కుటుంబంతో ఆనందంగా ఈ సంక్రాంతి జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇజిఎస్ డైరెక్టర్, షణ్ముఖ్ కుమార్, పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్, సుధాకర్, పేషి ఉద్యోగులు పాల్గొన్నారు.
addComments
Post a Comment