సహజ వనరుల వినియోగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

 

  అమరావతి (ప్రజా అమరావతి);


*సహజ వనరుల వినియోగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి


*

- మైనింగ్ రంగంలో కొత్త లక్ష్యాలతో ముందుకు సాగినపుడు మాత్రమే మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందని భువనేశ్వర్‌లో నిర్వహించిన నేషనల్ మైనింగ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

- సస్టైనబుల్ మైనింగ్ ఫర్ వికసిత్ భారత్ మూడో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

- రాష్ట్రంలో మైనింగ్ రంగంలో ఉన్న అపార అవకాశాలు, క్రిటికల్ మైనింగ్ ఆవశ్యకతను మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు.

- దేశస్థాయిలో మైనింగ్ శాఖల సదస్సుల ద్వారా రాష్ట్రాలు తమ సూచనలను,, పాలసీలను, అవసరాలను, ఆకాంక్షలను పరస్పరం పంచుకోవడానిక అవకాశం కలుగుతుంది.

- ప్రధాన మంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు, యువతలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకునే అవకాశం లభిస్తోంది.

- డీఎంఎఫ్ ద్వారా రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాల పెంపు సహా సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది.

- భారతదేశం గత 75 సంవత్సరాల్లో స్టీల్, సిమెంట్, అల్యూమినియం వంటి అనేక ఉత్పత్తుల్లో మెరుగైన స్థానాన్ని సంపాదించుకుంది.

- ఇనుప ఖనిజం, బాక్సైట్, లైమ్ స్టోన్ లాంటి లాంటి కీలక మినరల్స్ ఎగుమతిలో తమదైన ముద్ర వేసుకున్నాం.

- ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా సోలార్, విండ్, సెమీ కండక్టర్స్ లాంటి రంగాల్లో మనం ముందంజ వేయాల్సిన సమయం వచ్చింది.

- అందుకోసం క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి, ప్రాసెసింగ్ పై దృష్టి సారించాలి. తద్వారా దిగుమతులపై ఆధారపడాల్సిన అవకాశం తగ్గుతంది.

- పర్యావరణ పరిరక్షణ మరియు క్రిటికల్ మైనింగ్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి పట్టణ మైనింగ్ పై కూడా దృష్టి పెట్టాలి.

- రీ సైక్లింగ్ సహా కీలకమైన ఖనిజాల విభాగాల్లో అవగాహన కల్పించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం ప్రస్తుతం అత్యంత అవసరం. 

- ఏప్రిల్ 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ వర్క్ షాపులను నిర్వహించాలని కోరుతున్నాను.

- క్రిటికల్ మినరల్స్ గుర్తింపు, వెలికితీత మరియు ప్రాసెసింగ్‌పై లోతైన అవగాహన విషయంలో ఈ వర్క్ షాపులు విద్యార్థులు, టీచింగ్ కు ఉపయోగపడతాయి.

- అటువంటి షాపులను నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

- మా యొక్క ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి గనుల మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలు అందించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.

- నోటిఫైడ్ ప్రైవేట్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (NPEA) దేశంలో ఖనిజాన్వేషణకు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం.

- అయితే సరైన విజన్ లేకపోవడం, ముందుగా గుర్తించకపోవడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

- రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా వనరుల నిర్వహణకు సంబంధించిన సమాచారం అందించేలా NPEAలను తప్పనిసరి చేయాలని గనుల మంత్రిత్వ శాఖను కోరుతున్నా. 

- క్రిటికల్ మినరల్స్ పై నివేదికలను విశ్లేషించేందుకు అవసరమైన మానవ వనరులు లేకపోవడంతో రాష్ట్ర DMGలు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. 

- అందువలన రాష్ట్ర DMG అధికారులకు ప్రాక్టికల్ ఫీల్డ్ సెషన్‌లతో సహా GSI శిక్షణా సంస్థ రెగ్యులర్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని నేను కోరుతున్నాను.

- ఈ కార్యక్రమాలు క్రిటికల్ మినరల్స్ గుర్తింపు, వాటి నిర్వహణకు తోడ్పాటు అందిస్తుంది. 

- గనుల శాఖను బలోపేతం చేయడం, సవాళ్లను అధిగమించడం మరియు అన్వేషణ, ఉత్పత్తి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కేంద్ర మైనింగ్ శాఖతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.

- భారతదేశ మైనింగ్ రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు నడిపించడంతో పాటుగా సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మనస్పూర్తిగా తెలియజేస్తున్నానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Comments