వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన 2014-19నాటి నరేగా పనులు పునరుద్దరించాలి.

 


*2014-19నాటి ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి.*


*వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన 2014-19నాటి నరేగా పనులు పునరుద్దరించాలి


*.


కేంద్ర గ్రామీణ సహాయ మంత్రివర్యులు పెమ్మసానికి వినతిపత్రం అందచేసిన గౌడ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఉపాధి హామీ మండలి సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి, మొవ్వ లక్ష్మీ సుభాషిని.

 అమరావతి (ప్రజా అమరావతి);

2014-19 మధ్య కాలంలో గ్రామీణ ఉపాధి హామీపథకం క్రింద గుత్తేదారులు చేసిన పలు రకాల గట్టి పనులకు సంబంధించిన బిల్లులను గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా నిలిపేసింది. అలాగే గుత్తేదారులు చేసిన పనులను కూడా రద్దు చేసింది. దీనివల్ల గుట్టేదారులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ప్రజా సంక్షేమం కోసం చేసిన పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా రద్దు చేయడం దుర్మార్గం. కక్షపూరితంగా గుత్తేదారులను గత ఐదేళ్లలో వైసీపీ నేతలు వేధించారు. వైసీపీ నిర్వహాకం వల్ల దాదాపు 55మంది ఉపాధి హామీ పనులు చేసిన వారు చనిపోయారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు  మరియు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి హామీ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్  ఈ విషయం పట్ల బాధ్యత తీసుకొని క్యాబినెట్లో తీర్మానం చేసి 330 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడానికి మార్గం సుగమనం చేశారు . ఆ నిధులను విడుదల చేయడానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ వారు అప్లోడ్ చేయగా అందులో 222 కోట్ల రూపాయలు సంబంధించిన పనులను క్లోజ్ చేసి నట్లుగా గుర్తించారు. గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా కేంద్రానికి  సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది. ఆ దుర్మార్గపు చర్య ప్రస్తుతం బిల్లులు చేయడానికి అవరోధంగా మారింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ ఆఫీస్ వారు కేంద్ర ప్రభుత్వానికి  క్లోజ్డ్ వర్క్స్ ని ఓపెన్ చేయవలసిందిగా లేఖ రాయడం  జరిగింది .అదే విషయాన్ని గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ  సహాయ మంత్రి అయినటువంటి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ ని కలసి  తిరిగి బిల్లులు చెల్లించటానికి అనువుగా సైట్ ఓపెన్ చేయించి,  గత ప్రభుత్వం నిలిపేసిన పెండింగ్ బిల్లులను చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి,  మొవ్వ లక్ష్మీ సుభాషిణి మంత్రిగారి కార్యాలయంలో కలిసి విన్నవించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, గత ప్రభుత్వంలో నష్టపోయిన కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments