*వేవ్స్ 2025 సవాళ్లను జర్నలిజం విద్యార్థులకు వివరించిన పీఐబీ,
వేవ్స్ పోర్టల్ ద్వారా సవాళ్లలో పాల్గొనాలని సూచన*
*జర్నలిజంలో ఏఐ పాత్ర, డిజిటల్ అక్షరాస్యతలపై పీఐబీ ఎడిజి రాజీందర్ చౌదరి ప్రస్తావన*
తిరుపతి, ఫిబ్రవరి 20, 2025 (ప్రజా అమరావతి);
వేవ్స్ 2025లో భాగంగా ఆన్‌లైన్ క్రియేట్ ఛాలెంజ్‌లలో యువత భారీగా పాల్గొనాలని పత్రికా సమాచార కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్, శ్రీ రాజీందర్ చౌదరి సూచించారు.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీఎంవీవీ), తిరుపతిలో జర్నలిజం విద్యార్థులకు నిర్వహించిన మీడియా కార్యశాలను ఉద్దేశించి మాట్లాడిన ఎడిజి శ్రీ చౌదరి, ఆధునిక మీడియాలో ఏఐ సాధనాల వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల పాత్ర, డిజిటల్ వేదికల పెరుగుతున్న ప్రాముఖ్యత, మీడియా మరియు వినోద రంగంలోని గొప్ప అవకాశాలపై దృష్టి సారించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు పాల్గొన్నారు, జర్నలిజం విభాగం నుండి మీడియా నిపుణులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రాంతీయ మీడియాకు అందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలను చేరుకునేందుకు పీఐబీ పనిచేస్తోందని, స్థానిక పరిస్థితులపై ప్రభుత్వానికి నియమిత నివేదికలను పీఐబీ అందిస్తుందని ఆయన తెలిపారు.
ఏ అంశంపైనా ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు పీఐబీ సరైన సమాచారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. వివిధ సాంస్కృతిక, కళా రంగాల ద్వారా, పత్రికా మాధ్యమాలు, ప్రకటనల ద్వారా ప్రభుత్వ పథకాలపై పీఐబీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు.
ముఖ్య అతిథులుగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ వాణి, ఎస్పీఎంవీవీ నాయశాస్త్ర విభాగాధిపతి ఆచార్య సీతాకుమారి పాల్గొన్నారు. పరిణామం చెందుతున్న డిజిటల్ పరిదృశ్యంలో మీడియా విద్య , చట్ట్టాల పై అవగాహన, ప్రాముఖ్యతను వారు వివరించారు, బాధ్యతాయుత పత్రికా రచనతోపాటు సమాచారయుత ప్రజా చర్చను రూపొందించడంలో రెండు రంగాలు ఎలా దోహదపడతాయో నొక్కి చెప్పారు.
శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం నుండి ప్రొఫెసర్ కిరణ్ ప్రసాద్, తిరుపతి జిల్లా డిప్రో శ్రీ బాలకొండయ్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు వేగంగా మారుతున్న మీడియా వాతావరణానికి అనుగుణంగా సిద్ధంగా ఉండేలా, పాఠ్యప్రణాళికలో కొత్త సాంకేతికతలను మెరుగ్గా సమన్వయం చేసుకోవడానికి విద్యా సంస్థలు, మీడియా సంస్థల మధ్య సహకారం అవసరమని వారు మాట్లాడారు.
వార్తా నివేదన, కంటెంట్ తయారీని సులభతరం చేయడానికి, ప్రజల్లో మీడియా అక్షరాస్యతను పెంపొందించడానికి ఏఐ- కృత్రిమమేధస్సు సాధనాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చో అనే అంశంపై మీడియా సిబ్బంది జర్నలిజం విభాగం విద్యార్థులు చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.
ఇలాంటి వేదికల ప్రాముఖ్యతపై మాట్లాడుతూ, పత్రికా రచనా సమగ్రత, చట్ట నిబంధనల సారాన్ని కాపాడుతూనే సాంకేతిక పురోగతిని స్వీకరించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ వాణి నొక్కి చెప్పారు. భవిష్యత్ జర్నలిస్టులకు అత్యాధునిక నైపుణ్యాలను అందించేందుకు ఈ సాధనాలను విద్యా పాఠ్యాంశాలలో ఎలా సమన్వయం చేయవచ్చో అనే విషయం పైన ఈ చర్చలు కేంద్రీకృతమయ్యాయి.
సాంకేతికత అందరి విద్యార్థులకూ అందుబాటులో ఉండేలా చూడటంలో విశ్వవిద్యాలయం, మీడియా ఎలా కలిసి పనిచేయవచ్చో కూడా ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించగలిగింది.
నిపుణులు, పాల్గొన్నవారు విలువైన దృక్కోణాలను పంచుకున్న ఈ కార్యశాల సంవాదం జ్ఞానప్రదమైన సమావేశంగా నిలిచింది. మీడియా విద్యను రూపొందించడంలో, విద్యా రంగంలో సాంకేతికతను ముందుకు తీసుకెళ్లడంలో విశ్వవిద్యాలయం నిబద్ధతకు ఇది మరో మైలురాయిగా నిలుస్తుంది.
addComments
Post a Comment